Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్రెంచ్‌ ఓపెన్‌.. కెర్బర్‌, వీనస్‌ ఔట్‌

French Open: Angelique Kerber, Venus Williams Knocked Out In First Round

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలి రోజు సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌ విభాగంలో ఇద్దరు ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ క్రీడాకారిణులు ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ), వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా)లు తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. మరోవైపు కుజెనొత్సొవా (రష్యా) తొలి రౌండ్లోనే ఓడగా.. స్పెయిన్‌ స్టార్‌ ముగురుజ అతి కష్టం మీద రెండో రౌండ్లో ప్రవేశించింది.

కెర్బర్‌కు షాక్:

కెర్బర్‌కు షాక్:

ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఐదో సీడ్‌ కెర్బర్‌ 4-6, 2-6తో వరుస సెట్లలో ప్రపంచ ర్యాంకింగ్‌లో 81వ స్థానంలో ఉన్న పొటపోవా చేతిలో ఓడిపోయింది. కెరీర్‌లో తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ మొయిన్‌ డ్రాలో ఆడుతున్న పొటపోవా.. కెర్బర్‌ను ఓ ఆటాడుకుంది. టాప్‌-10 క్రీడాకారిణిపై నెగ్గడం పొటపోవాకు ఇదే తొలిసారి. మరోవైపు ఫ్రెంచ్‌ ఓపెన్ తొలి రౌండ్లో ఓడడం కెర్బర్‌కు ఇది ఆరోసారి.

వీనస్‌ ఔట్‌:

వీనస్‌ ఔట్‌:

తొమ్మిదో సీడ్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌) 6-3, 6-3తో సీనియర్ వీనస్‌ను ఓడించింది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వీనస్‌ ఏదశలోనూ స్వితోలినాకు పోటీనివ్వలేదు. మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసిన వీనస్‌.. 34 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. 22వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పాల్గొన్న వీనస్‌.. 2006 తర్వాత ఈ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ దాటలేకపోయింది.

అతి కష్టం మీద:

అతి కష్టం మీద:

19వ సీడ్‌ ముగురుజ అతి కష్టం మీద రెండో రౌండ్లో ప్రవేశించింది. తొలి రౌండ్లో 5-7, 6-2, 6-2తో టౌన్‌సెండ్‌ (అమెరికా)ను ఓడించింది. కుకోవా (స్లొవేకియా) 6-4, 6-2తో కుజెనొత్సొవాపై గెలిచింది. మరోవైపు ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-2, 6-3తో బ్రెంగెల్‌ (అమెరికా)పై గెలిచింది. 15వ సీడ్‌ బెలిండా బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌) 6-1, 6-4తో జెస్సికా పొంచెట్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచింది.

Story first published: Monday, May 27, 2019, 9:03 [IST]
Other articles published on May 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+