Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్రెంచ్ ఓపెన్‌లో తెలుగోడి సంచలనం!

ఫ్రెంచ్ ఓపెన్ 2026 గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సరికొత్త సంచలనం నమోదైంది. పారిస్ వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీ తొలి రోజే.. ఏదో ఒక అద్భుతం చేస్తాడనుకున్న ఏడో సీడ్ టైలర్ ఫ్రిట్జ్‌కు ఊహించని షాక్ తగిలింది. అమెరికాకే చెందిన 21 ఏళ్ల భారత సంతతి యువ టెన్నిస్ ఆటగాడు నిశేష్ బసవరెడ్డి.. కోర్టు సుజాన్-లెంగులేన్‌పై జరిగిన హోరాహోరీ పోరులో ఫ్రిట్జ్‌ను 7-6(5), 7-6(5), 6-7(9), 6-1 తేడాతో మట్టికరిపించాడు. ఈ అద్భుత విజయంతో టెన్నిస్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ కుర్రాడి వైపే చూస్తోంది. పారిస్ మైదానంలో ప్రేక్షకులంతా నిశేష్ బసవరెడ్డి పేరును గట్టిగా నినదిస్తుండగా.. తన కెరీర్‌లోనే ఇది అతిపెద్ద విజయమని బసవరెడ్డి ఆనందం వ్యక్తం చేశాడు.

ఈ సంచలన విజయంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నిశేష్ బసవరెడ్డికి ఇండియాతో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రంతో బలమైన బంధం ఉంది. నిశేష్ బసవరెడ్డి మే 2, 2005న కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్‌లో జన్మించాడు. నిశేష్ తల్లిదండ్రులు మురళీకృష్ణ, సాయి ప్రసన్నలు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందినవారు. వారు 1999లోనే అమెరికాకు వలస వెళ్లారు. అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ.. భారతీయ మూలాలున్న ఈ యువ టెన్నిస్ స్టార్‌ను ప్రస్తుతం అమెరికన్ టెన్నిస్‌లో ఓ సరికొత్త ఆశాకిరణంగా, భావి తారగా అభివర్ణిస్తున్నారు.

French Open 2026 Indian-Origin Nishesh Basavareddy Stuns 7th Seed Taylor Fritz Full Details

నిశేష్ బసవరెడ్డి టెన్నిస్ ప్రయాణం జూనియర్ స్థాయి నుంచే ఎంతో అద్భుతంగా సాగింది. 2022లో అతను ఓజాన్ బారిస్‌తో జతకట్టి యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా మొదటిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో రెండేళ్ల పాటు చదువుకుంటూనే తన టెన్నిస్ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్నాడు. 2024 సీజన్ అతని కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. ఆ ఏడాది ఏటీపీ ఛాలెంజర్ టూర్‌లో రెండు టైటిళ్లు గెలవడంతో పాటు మరో నాలుగు టోర్నీలలో ఫైనల్స్‌కు చేరుకున్నాడు.

2024 సీజన్‌లో నిశేష్ బసవరెడ్డి 41-13 రికార్డుతో సంచలనం సృష్టించాడు. 1978 తర్వాత ఒకే సీజన్‌లో 40 కంటే ఎక్కువ చాలెంజర్ మ్యాచ్‌లు గెలిచిన మూడో అమెరికన్‌గా నిపేష్ బసవరెడ్డి అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో 2024 సెప్టెంబర్‌లో టాప్-200 ర్యాంకింగ్స్‌లోకి దూసుకొచ్చాడు. ఆపై నవంబర్‌లో ప్యూర్టో వల్లర్టా ఓపెన్ గెలిచిన తర్వాత తన కెరీర్ బెస్ట్ 139వ ర్యాంకును అందుకున్నాడు. ఆ తర్వాత అతను నెక్స్ట్ జనరేషన్ ఏటీపీ ఫైనల్స్‌కు అర్హత సాధించి, అక్కడ తన మొదటి ఏటీపీ స్థాయి విజయాన్ని నమోదు చేశాడు.

ఈ అద్భుతమైన ప్రదర్శనల అనంతరం, డిసెంబర్ 2024లో నిశేష్ బసవరెడ్డి అధికారికంగా ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా మారాడు. ఈ ఏడాది (2026) ఆరంభంలో జరిగిన ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా అతను తన గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను ప్రారంభించాడు. విశేషమేమిటంటే.. తన మొదటి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లోనే అతను టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌ను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ డ్రాలో తొలిసారి అడుగుపెట్టి, ఏకంగా టాప్-10 ఆటగాడైన టైలర్ ఫ్రిట్జ్‌ను ఓడించి టెన్నిస్ ప్రపంచాన్ని షేక్ చేశాడు. రాబోయే రోజుల్లో ఈ తెలుగు మూలాలున్న కుర్రాడు మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Monday, May 25, 2026, 11:26 [IST]
Other articles published on May 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+