Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

French Open: మెద్వెదెవ్‌కు షాక్.. క్వార్టర్స్‌కు జకోవిచ్

ఫ్రెంచ్ ఓపెన్‌లో అయిదో సీడ్ డానియల్ మెద్వెదెవ్ (రష్యా) ఇంటిముఖం పట్టాడు. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 11 సీడ్ డిమెనార్ (ఆస్ట్రేలియా) చేతిలో 6-4, 2-6, 1-6, 3-6 తేడాతో ఓటమిపాలై గ్రాండ్ స్లామ్ నుంచి నిష్క్రమించాడు. తొలి సెట్‌లో సత్తాచాటిన మెద్వెదెవ్ తర్వాత సెట్స్‌లో మాత్రం వరుసగా విఫలమయ్యాడు.

మొదటి గెలిచి జోరు మీదున్న మెద్వెదెవ్‌‌కు డిమెనార్ రెండో సెట్‌లో షాక్ ఇచ్చాడు. అద్భుతంగా పుంజుకుని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు మూడో సెట్‌లోనూ మెద్వెదెవ్ తడబడ్డాడు. నాలుగో సెట్‌లో పోరాడినప్పటికీ ఆఖరి సెట్ వరకు మ్యాచ్‌ను కొనసాగించలేకపోయాడు. అనవసరం తప్పిదాలతో ప్రత్యర్థికి పాయింట్లు అప్పగించాడు.

French Open 2024 Alex de Minaur Upsets Daniil Medvedev

క్వార్టర్స్‌కు జకోవిచ్
దిగ్గజ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) క్వార్టర్స్‌కు చేరాడు. అయితే ప్రిక్వార్టర్స్‌లో జకోవిచ్ గట్టిపోటీని ఎదుర్కొన్నాడు. అర్జెంటీనా ఆటగాడు సెరున్‌డొలో సంచలన ప్రదర్శన చేశాడు. జకోవిచ్‌కు ఓటమి రుచి చూపించేలా సత్తాచాటాడు. కానీ అంతిమంగా జకోవిచ్ పైచేయి సాధించాడు. హోరాహోరీగా సాగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో జకోవిచ్ 6-1, 5-7, 3-6, 7-5, 6-3తో గెలిచాడు.

సత్తాచాటిన బోపన్న
భారత డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి బోపన్న.. శ్రీరామ్ బాలాజీ- రియెస్ (మెక్సికో) జోడిని ప్రిక్వార్టర్స్‌లో 6-7 (2-7), 6-3, 7-6 (10-8)తో ఓడించాడు. ఉమెన్స్ సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ అర్యానా సబలెంక (బెలారస్), రిబాకినా (కజికిస్థాన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో నవారో (అమెరికా)ను సబలెంక 6-2, 6-3తో, స్వితోలినా (ఉక్రెయిన్‌)ను 6-4, 6-3తో రిబాకినా ఓడించారు. అలాగే జాస్మిన్ పావొలిని (ఇటలీ), మిరా ఆండ్రీవా (రష్యా) క్వార్టర్స్‌కు చేరుకున్నారు.

Story first published: Tuesday, June 4, 2024, 9:10 [IST]
Other articles published on Jun 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+