For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

French Open 2021: ప్రిక్వార్టర్స్‌లో సెరెనా.. సబలెంకాకు షాక్‌! నాదల్‌, జ్వెరెవ్‌ ముందంజ!!

French Open 2021: Serena Williams beat Danielle Collins in third-round, Aryna Sabalenka out

పారిస్‌: మాజీ ప్రపంచ నంబర్‌వన్‌, 15వ సీడ్‌ విక్టోరియా అజరెంకా (బెలారస్‌) ఫ్రెంచ్‌ ఓపెన్ 2021లో దూసుకెళ్తోంది. ఈ బెలారస్‌ స్టార్‌ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో అజరెంకా 6-2, 6-2తో మాడిసన్‌ కీస్‌ (అమెరికా)ను చిత్తు చేసింది. 70 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో విక్టోరియా బలమైన షాట్ల ముందు కీస్‌ ఏమాత్రం నిలవలేకపోయింది. చాన్నాళ్ల తర్వాత రొలాండ్‌ గారోస్‌లో సత్తా చాటుతూ ఫ్రెంచ్‌ ఓపెన్లో ప్రిక్వార్టర్స్‌లోకి అజరెంకా ప్రవేశించింది. 2013 తర్వాత అజరెంకా ఈ టోర్నీలో ఈ దశకు రావడం విశేషం.

రెండో రౌండ్‌లో శ్రమించి విజయాన్ని దక్కించుకున్న అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ మూడో రౌండ్‌లో మాత్రం సత్తాచాటింది. తన దేశానికే చెందిన డానియెలా కొలిన్స్‌తో జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో 6-4, 6-4తో గెలిచిన సెరెనా.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో 13వసారి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 85 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా ఐదు ఏస్‌లు సంధించింది. నెట్‌ వద్దకు 12 సార్లు దూసుకొచ్చి.. 8సార్లు పాయింట్లు సంపాదించిన సెరెనా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది.

టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకరైన మూడో సీడ్‌ ఆర్యనా సబలెంకా (బెలారస్‌) మూడో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. 31వ సీడ్‌, రష్యా అమ్మాయి పవ్లుచెన్‌కోవా అద్భుత ఆటతీరుతో 6-4, 2-6, 6-0తో సబలెంకాను బోల్తా కొట్టించి.. 2011 తర్వాత ఈ టోర్నీ లో మళ్లీ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. రెబకీనా (కజకిస్థాన్‌), తామర జిదాన్‌సెక్‌ (స్లొవేనియా), మర్కెత వొంద్రుసొవా (చెక్‌ రిపబ్లిక్‌) కూడా ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.

పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. రిచర్డ్‌ గాస్కే (ఫ్రాన్స్‌)తో జరిగిన మ్యాచ్‌లో నాదల్‌ 6-0, 7-5, 6-2తో గెలుపొందాడు. గాస్కే పరాజయంతో 1968 తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పురుషుల, మహిళల సింగిల్స్‌ విభాగంలో ఒక్క ఫ్రాన్స్‌ క్రీడాకారుడు కూడా మూడో రౌండ్‌కు చేరుకోవడంలో విఫలమయ్యాడు. జర్మనీ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ప్రిక్వార్టర్స్‌ చేరాడు. మూడో రౌండ్లో 6-2, 7-5, 6-2తో లాస్లో జెరె (సెర్బియా)ను ఓడించాడు. రెండోసీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా), నిషికోరి (జపాన్‌), డెల్‌బోనిస్‌ (అర్జెంటీనా), డేవిడోవిచ్‌ (స్పెయిన్‌) కూడా మూడో రౌండ్‌ అధిగమించారు.

Story first published: Saturday, June 5, 2021, 11:07 [IST]
Other articles published on Jun 5, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+