For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

French Open 2021: సోఫియాకు షాక్‌.. కొకోగాఫ్‌ దూకుడు! పోరాడి గెలిచిన జకో!

French Open 2021: Coco Gauff enters quarter-finals, Novak Djokovic and Rafael Nadal advance

పారిస్‌: ఆన్ సీడెడ్‌ క్రీడాకారిణులకు ఫ్రెంచ్‌ ఓపెన్‌ 2021 కలసి రావడం లేదు. తాజాగా మహిళల సింగిల్స్‌లో గత ఏడాది రన్నరప్, నాలుగో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) కూడా ఇంటిముఖం పట్టింది. దాంతో క్వార్టర్‌ ఫైనల్‌ బరిలో టాప్‌-20లో కేవలం ఇద్దరు మాత్రమే బరిలో మిగిలారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్‌ మరియా సాకరి (గ్రీస్‌) 6-1, 6-3తో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ కెనిన్‌పై సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో సాకరి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. అంతేకాకుండా ఈ ఘనత సాధించిన తొలి గ్రీస్‌ క్రీడాకారిణిగా కూడా గుర్తింపు పొందింది.

అమెరికా టీనేజర్‌ కొకోగాఫ్‌ రొలాండ్‌ గారోస్‌లో దూసుకెళ్తోంది. సునాయాస విజయంతో క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో గాఫ్‌ 6-3, 6-1తో జబెర్‌ (ట్యునీసియా)పై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో బార్బారా క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో గాఫ్‌ తలపడనుంది. గత 15 ఏళ్లలో గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్స్‌లో ప్రవేశించిన పిన్న వయస్కురాలిగా గాఫ్‌ (17 ఏళ్లు) ఘనత సొంతం చేసుకుంది. మరో ప్రిక్వార్టర్స్‌లో క్రెజికోవా 6-2, 6-0తో స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా) పోరాటానికి తెరదించింది. ఈ పోరులో స్లోన్‌ ప్రతిఘటన తొలి సెట్‌కే పరిమితమైంది. బలమైన షాట్లతో విరుచుకుపడి రెండో సెట్లో స్లోన్‌కు ఒక్క గేమ్‌ కూడా ఇవ్వకుండా నెగ్గిన క్రెజికోవా.. సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ నోవాక్ జొకోవిచ్‌ (సెర్బియా) 15వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతున్న 19 ఏళ్ల ఇటలీ టీనేజర్‌ లొరెంజో ముజెత్తితో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌ 6-7 (7/9), 6-7 (2/7), 6-1, 6-0, 4-0తో విజయం సాధించాడు. 3 గంటల 27 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ తొలి రెండు సెట్‌లను కోల్పోయాడు. ఆ తర్వాత అతను అనూహ్యంగా తేరుకొని వరుసగా రెండు సెట్‌లు గెలిచాడు. నిర్ణాయక చివరి సెట్‌లో జకో 4-0తో ఆధిక్యంలో ఉన్న దశలో లొరెంజో వెన్నునొప్పితో మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు. దాంతో జొకోవిచ్‌ విజయం ఖాయైమంది.

డిఫెండింగ్‌ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) 15వ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకున్నాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నాదల్‌ 7-5, 6-3, 6-0తో జానిక్‌ సినెర్‌ (ఇటలీ)పై గెలుపొందాడు. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6-4, 6-1, 6-1 తో నిషికోరి (జపాన్‌)పై.. ఫొకినా (స్పెయిన్‌) 6-4, 6-4, 4-6, 6-4తో డెల్‌బోనిస్‌ (అర్జెంటీనా)పై.. పదో సీడ్‌ ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా) 7-6 (11/9), 6-4, 7-5తో లెనార్డ్‌ స్ట్రఫ్‌ (జర్మనీ)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఇక ఫ్రెంచ్‌ ఓపెన్లో భారత కథ ముగిసింది. డబుల్స్‌లో రోహన్‌ బోపన్న పరాజయం చవిచూశాడు. క్వార్టర్స్‌లో బోపన్న-ఫ్రాంకో కుగర్‌ (క్రొయేషియా) 5-7, 3-6తో పాబ్లో అండుజార్‌-పెడ్రో మార్టినెజ్‌ (స్పెయిన్‌) చేతిలో వరుస సెట్లలో ఓడారు.

Story first published: Tuesday, June 8, 2021, 7:28 [IST]
Other articles published on Jun 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+