న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సంచనాలు.. ఒసాకా, సెరెనా ఔట్‌

French Open 2019: Tennis Stars Serena Williams and Naomi Osaka Lose in the Third Round

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సంచలనాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచ నంబర్‌వన్‌ నవోమి ఒసాకాతో పాటు అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్‌ మూడో రౌండ్లోనే ఓడిపోయారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్లో ఒసాకా 4-6, 2-6తో కేథరిన్‌ సినియాకోవా (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో ఓడిపోయింది. 77 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినియకోవా అద్భుతంగా ఆడి కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సింగిల్స్‌ విభాగంలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌లో ఒసాకా నంబర్‌వన్‌ కాగా.. మహిళల డబుల్స్‌లో సినియోకోవా నంబర్‌వన్‌. సింగిల్స్‌లో మాత్రం 42వ ర్యాంకులో ఉంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్‌ 2-6, 5-7తో అన్‌సీడెడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హలెప్‌ (రొమేనియా) 6-2, 6-1తో తుర్సెంకోవా (ఉక్రెయిన్‌)ను ఓడించింది. మాడిసన్‌ కీస్‌ (అమెరికా), స్విటెక్‌ (పోలెండ్‌) కూడా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. కీస్‌ 6-3, 6-7 (5/7), 6-4తో బ్లిన్‌కోవా (రష్యా)పై, స్వియాటెక్‌ 0-6, 6-3, 6-3తో మోనికా పుయిగ్‌ (ప్యూర్టోరికో)పై గెలిచారు.

పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో టాప్‌ సీడ్‌ నొవాక్‌ 6-3, 6-3, 6-2తో కారుసో (ఇటలీ)పై విజయం సాధించాడు. గ్రీసు వీరుడు సిట్సిపాస్‌ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మూడో రౌండ్లో 7-5, 6-3, 6-7 (7-5), 7-6 (8-6)తో క్రాజానోవిచ్‌ (క్రొయేషియా)పై గెలిచాడు. గత 83 ఏళ్లలో రొలాండ్‌ గారోస్‌లో ప్రిక్వార్టర్స్‌ చేరిన తొలి గ్రీకు ఆటగాడిగా సిట్సిపాస్‌ ఘనత సాధించాడు. మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌), ఫాగ్‌నిని (ఇటలీ) ప్రిక్వార్టర్స్‌ చేరారు. జర్మనీ కుర్రాడు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ 6-4, 6-2, 4-6, 1-6, 6-2తో లజోవిచ్‌ (క్రొయేషియా)ను ఓడించాడు. వావ్రింకా (స్విట్జర్లాండ్‌), డొమినిక్‌ థీమ్‌ (కెనడా), స్ట్రఫ్‌ (జర్మనీ), బోర్నా కొరిచ్‌ (క్రొయేషియా) కూడా ప్రిక్వార్టర్స్‌ చేరుకున్నారు.

French Open 2019: Tennis Stars Serena Williams and Naomi Osaka Lose in the Third Round

పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్‌లో లియాండర్‌ పేస్‌ ఓడిపోయాడు. పేస్‌-పెయిర్‌ (ఫ్రాన్స్‌) 0-6, 6-4, 3-6తో కబాల్‌-ఫరా (కొలంబియా) చేతిలో పరాజయం చవిచూశారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జీవన్‌ నెడుంచెజియన్‌ ఓడాడు. తొలి రౌండ్లో జీవన్‌-మూర్‌ 7-5, 4-6, 0-1 (5-10)తో చెన్‌-మరాచ్‌ చేతిలో ఓడారు.

Story first published: Sunday, June 2, 2019, 9:18 [IST]
Other articles published on Jun 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X