న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌, జకోవిచ్‌ శుభారంభం

French Open 2019: Stars Rafael Nadal and Novak Djokovic enters in to second round

స్పెయిన్‌ బుల్ రఫెల్‌ నాదల్‌, సెర్బియా స్టార్ నొవాక్‌ జకోవిచ్‌లు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో శుభారంభం చేశారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నాదల్‌ పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 6-2, 6-1, 6-3తో జర్మన్‌ క్వాలిఫయర్‌ యానిక్‌ హఫ్‌మాన్‌పై విజయం సాధించాడు. టాప్‌ సీడ్‌ జకోవిచ్‌ 6-4, 6-2, 6-2తో హర్కాజ్‌ (పోలెండ్‌)ను ఓడించాడు. ఇద్దరు అలవోక విజయాలు అందుకుని రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మరో మ్యాచ్‌లో సోంగా (ఫ్రాన్స్‌) 7-6 (7-4), 6-1, 4-6, 6-3తో గొజోజిక్‌ (జర్మనీ)పై విజయం సాధించాడు. వావ్రింకా (స్విట్జర్లాండ్‌) 6-1, 6-7 (3-7), 6-2, 6-3తో కొవాలిక్‌ (స్లొవేకియా)పై, గాస్కెట్‌ (స్పెయిన్‌) 6-3, 6-4, 6-3తో మిషా జ్వెరెవ్‌ (జర్మనీ)పై, కోరిచ్‌ (క్రొయేషియా) 6-1, 6-7 (4-7), 6-4, 6-4తో బెడెన్‌ (స్లొవేనియా)పై గెలుపొందారు.

మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్‌ వోజ్నియాకి (డెన్మార్క్‌) టోర్నీ నుండి నిష్క్రమించింది. తొలి రౌండ్‌లో 6-0, 3-6, 3-6తో కుదెర్మెటోవా (రష్యా) చేతిలో పరాజయం పాలైంది. ఎనిమిదో సీడ్‌ ఆష్లే బార్తీ (ఆస్ట్రేలియా), 12వ సీడ్‌ సెవత్సొవా (లాత్వియా) శుభారంభం చేశారు. ఇతర మ్యాచ్‌ల్లో బెర్టెన్స్‌, క్రిస్టీ (రొమేనియా), కనెపి (ఎస్తోనియా), కొంటా (బ్రిటన్‌)లు గెలుపొందారు.

Story first published: Tuesday, May 28, 2019, 9:06 [IST]
Other articles published on May 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X