For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒసాకా, హలెప్‌ ముందంజ.. అతికష్టం మీద నెగ్గిన జ్వెరెవ్‌

French Open 2019: Star Palyer Alexander Zverev, Naomi Osaka fights back and Simona Halep survives a testing first round

పారిస్‌ వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టాప్‌సీడ్‌ క్రీడాకారిణిలు ఒసాకా, హలెప్‌లు ముందంజ వేయగా.. జర్మనీ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ తృటిలో ఓటమిని తప్పించుకున్నాడు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ ఒసాకా, హలెప్‌లు రెండో రౌండ్‌ చేరుకున్నారు. ఒసాకా 0-6, 7-6 (4-7), 6-2తో షిమెద్లెవా (చెక్‌ రిపబ్లిక్‌)పై విజయం సాధించింది. మూడో సీడ్‌ హలెప్‌ 6-2, 3-6, 6-1తో టామ్‌జోనోవిచ్‌ (ఆస్ట్రేలియా)పై గెలుపొందింది. అజరెంక (బెలారస్‌) 6-4, 7-6 (7-4)తో వొస్టాపెంకో (లాత్వియా)ను ఓడించింది. బౌచర్డ్‌ (కెనడా) 2-6, 2-6తో తుర్సెంకో (ఉక్రెయిన్‌) చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో జ్వెరెవ్‌ 7-6 (7-4), 6-3, 2-6, 6-7 (5-7), 6-3తో జాన్‌ మిల్‌మన్‌ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. 4 గంటలకు పైగా ఈ మ్యాచ్ జరిగింది. మొదటి రెండు సెట్లు గెలిచిన జ్వెరెవ్‌.. ఆ తర్వాత రెండు సెట్లు ఓడిపోయాడు. అయితే నిర్ణయాత్మక ఐదో సెట్లో పుంజుకున్న జ్వెరెవ్‌.. సెట్‌తో పాటు మ్యాచ్‌ గెలిచాడు.

French Open 2019: Star Palyer Alexander Zverev, Naomi Osaka fights back and Simona Halep survives a testing first round

ఇతర మ్యాచ్‌లలో డెల్‌పొట్రో (అర్జెంటీనా) 3-6, 6-2, 6-1, 6-4తో జారే (చిలీ)పై విజయం సాధించగా.. కచానోవ్‌ (రష్యా), వెర్దాస్కో (స్పెయిన్‌)లు రెండో రౌండ్‌ చేరారు. ఇక పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న జోడి శుభారంభం చేసింది. తొలి రౌండ్లో బోపన్న-కొపిల్‌ (రొమేనియా) 6-3, 7-6 (7-4)తో క్లాసన్‌ (దక్షిణాఫ్రికా)-వీనస్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచారు.

Story first published: Wednesday, May 29, 2019, 8:42 [IST]
Other articles published on May 29, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+