ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో తలపడనున్న నాదల్, ఫెదరర్

ఫ్రెంచ్ ఓపెన్‌లో రసవత్తర పోరు జరగనుంది. టెన్నిస్ దిగ్గజ ఆటగాళ్లు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో తలపడనున్నారు. ఫైనల్లో బెర్త్ కోసం వీళ్లిద్దరి మధ్యే సమరం జరుగనుంది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఫెదరర్, నాదల్‌లు తమ ప్రత్యర్థులపై విజయాలు అందుకుని సెమీస్‌లో అడుగుపెట్టారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో నాదల్ (స్పెయిన్) 6-1, 6-1, 6-3తో ఏడో సీడ్ నిషికోరి (జపాన్)పై గెలుపొందాడు. మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 7-6 (7/4), 4-6, 7-6 (7/5), 6-4తో మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో వీరిద్దరు తలపడనుండటం 2011 తర్వాత ఇదే తొలిసారి. మొత్తంగా వీరిద్దరు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఐదుసార్లు తలపడగా.. ఐదుసార్లూ నాదల్‌నే విజయం సాధించాడు.

మహిళల సిం గిల్స్ క్వార్టర్ ఫైనల్లో జొహనా కొంటా (బ్రిటన్) 6-1, 6-4తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచింది. 1983లో జో డ్యూరీ తర్వాత ఈ టోర్నీలో సెమీస్ చేరిన తొలి బ్రిటన్ ప్లేయర్‌గా కొంటా గుర్తింపు పొందింది. గతంలో నాలుగు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ బరిలో దిగినా.. ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించని కొంటా ఈసారి సెమీస్ చేరడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications