న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్‌, నాదల్‌.. ప్లిస్కోవాకు షాక్‌

French Open 2019: Roger Federer and Rafael Nadal into fourth round

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో స్విస్ మాస్టర్ రోజర్‌ ఫెదరర్‌, స్పెయిన్‌ బుల్ రఫెల్‌ నాదల్‌ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో మూడో సీడ్‌ ఫెడరర్‌ 6-3, 6-1, 7-6 (10-8)తో కాస్పర్‌ రూడ్‌ (నార్వే)పై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలలో అలవోకగా గెలిచిన ఫెడరర్‌.. మూడో సెట్లో రూడ్‌ నుంచి ప్రతిఘటన ఎదురైంది. పుంజుకున్న ఫెడరర్‌.. సెట్‌తో పాటు మ్యాచ్‌ గెలుచుకున్నాడు.

రెండో సీడ్‌ నాదల్‌ 6-1, 6-3, 4-6, 6-3తో డేవిడ్‌ గోఫిన్‌ (బెల్జియం)ను ఓడించాడు. తొలి రెండు సెట్లు గెలిచిన రఫా.. మూడో సెట్‌లో ఓడిపోయాడు. అద్భుత ఆటతో నాలుగో సెట్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. ఏడో సీడ్‌ నిషికొరి (జపాన్‌) 6-4, 6-7 (6-8), 6-3, 4-6, 8-6తో లాస్లో డెరె (సెర్బియా)పై చెమటోడ్చి గెలిచాడు. పౌలీ (ఇటలీ), బెన్నెట్‌ పైర్‌ (ఫ్రాన్స్‌) కూడా ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించారు.

మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) టోర్నీ నుండి నిష్క్రమించింది. మూడో రౌండ్లో ప్లిస్కోవా 3-6, 3-6తో అన్‌సీడెడ్‌ పెట్రా మార్టిచ్‌ (క్రొయేషియా) చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో మూడు డబుల్‌ఫాల్ట్‌లు చేసిన ప్లిస్కోవా.. ఐదుసార్లు సర్వీస్‌ కోల్పోయి ఓటమి చవిచూసింది. తొమ్మిదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) 3-6, 3-6తో ముగురుజ (స్పెయిన్‌) చేతిలో ఓడిపోయింది. వొండ్రొసోవా (రష్యా), సెవెత్సోవా (లాత్వియా) కూడా ప్రిక్వార్టర్స్‌ చేరారు.

ఇక పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న, లియాండర్‌ పేస్‌ ముందంజ వేశారు. రెండో రౌండ్లో బోపన్న-మారిస్‌ కోపిల్‌ 6-4, 6-4తో బెంజిమన్‌-హొయాంగ్‌లపై గెలవగా.. తొలి రౌండ్లో పేస్‌-పెయిర్‌ 6-4, 6-4తో ఇంగ్లాట్‌-కైజాన్‌ను ఓడించారు. దివిజ్‌ శరణ్‌-డిమోలియర్‌ జోడీ 3-6, 4-6తో కొంటినెన్‌-పియర్స్‌ చేతిలో ఓడింది.

Story first published: Saturday, June 1, 2019, 7:31 [IST]
Other articles published on Jun 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X