Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో జకోవిచ్‌ అరుదైన ఘనత.. క్వార్టర్‌ ఫైనల్లో హలెప్‌

French Open 2019: Novak Djokovic beats Jan-Lennard Struff to move into quarter-finals, Simona Halep dvanced

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెర్బియా స్టార్ నొవాక్‌ జకోవిచ్‌ దూసుకెళుతున్నాడు. జకోవిచ్‌ వరుసగా పదోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. జపాన్‌ స్టార్‌ నిషికోరి కూడా తుది ఎనిమిది జాబితాలో చోటు సంపాదించగా.. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హలెప్‌, మాడిసన్‌ కీస్‌, యాష్లె బార్టీ ముందంజ వేశారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌ 6-3, 6-2, 6-2తో జాన్‌ లెనార్డ్‌ స్ట్రాఫ్‌ (జర్మనీ)పై విజయం సాధించాడు. బుధవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)తో జొకోవిచ్‌ ఆడతాడు. 2005 నుంచి జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడుతున్నాడు. అయితే 2010 నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు క్వార్టర్‌ ఫైనల్‌కు, రెండుసార్లు సెమీ ఫైనల్‌కు, నాలుగుసార్లు ఫైనల్‌కు చేరుకున్నాడు. దీంతో వరుసగా పదేళ్లు ఈ టోర్నీలో కనీసం క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.

ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో జ్వెరెవ్‌ 3-6, 6-2, 6-2, 7-6 (7/5)తో తొమ్మిదో సీడ్‌ ఫాగ్‌నిని (ఇటలీ)పై.. ఏడో సీడ్‌ నిషికోరి (జపాన్‌) 6-2, 6-7 (8/10), 6-2, 6-7 (8/10), 7-5తో బెనోయిట్‌ పెయిర్‌ (ఫ్రాన్స్‌)పై, నాలుగో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 6-4, 6-4, 6-2తో మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)పై గెలుపొందారు.

మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) 6-1, 6-0తో స్వియాటెక్‌ (పోలాండ్‌)పై విజయంను అందుకుంది. యాష్లే బార్టీ 6-3, 3-6, 6-0తో సోఫియా కెనిన్‌ (అమెరికా)పై, కీస్‌ 6-2, 6-4తో సినియకోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, అనిసిమోవా 6-3, 6-0తో క్వాలిఫయర్‌ అలియోనా బొల్సోవా (స్పెయిన్‌)పై విజయం సాధించారు.

Story first published: Tuesday, June 4, 2019, 12:53 [IST]
Other articles published on Jun 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+