ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచనాలు పర్వం కొనసాగుతూనే ఉంది. టోర్నీ మొదటినుంచే టాప్ క్రీడాకారిణిలు ఇంటిదారి పట్టగా.. డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) కూడా టోర్నీ నుండి నిష్క్రమించింది. మరోవైపు పురుషుల విభాగంలో మాత్రం టాప్ ఆటగాళ్లు సెమీస్‌కు దూసుకొచ్చారు. ఇప్పటికే రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఫెడరర్ (స్విట్జర్లాండ్) సెమీస్‌లో అడుగుపెట్టగా.. తాజాగా ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్ కూడా వచ్చాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో హలెప్ 2-6, 4-6 తేడాతో అన్‌సీడెడ్ అనిసిమోవా చేతిలో పరాజయం పాలైంది. కీలక సమరంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన హలెప్.. మూల్యం చెల్లించుకుంది. తనకంటే ఎంతో మెరుగైన హలెప్‌ను వరుస సెట్లలో ఓడించి అనిసిమోవా ముందంజ వేసింది. మరో క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ బార్టీ (ఆస్ట్రేలియా) 6-3, 7-5తో మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలుపొందింది. శుక్రవారం సెమీస్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. బార్టీతో అనిసిమోవా.. జొహన్నతో మార్కెటా సెమీస్‌లో తలపడనున్నారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈసారి మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ కనిపించనుంది.
Back in the final 4️⃣.@DjokerNole too good for Zverev 7-5 6-2 6-2. Meets Them in the semi-finals.
— Roland-Garros (@rolandgarros) June 6, 2019
🎾 https://t.co/Zs3DNFWbFP #RG19 pic.twitter.com/sz1GWIHa2h
పురుషుల సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో జొకోవిచ్ (సెర్బియా) 7-5, 6-2, 6-2తో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై జయకేతనం ఎగురవేశాడు. నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6-2, 6-4, 6-2తో పదో సీడ్ ఖచనోవ్ (రష్యా)పై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ రోజు జరిగే సెమీఫైనల్స్‌లో రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో ఫెడరర్ (స్విట్జర్లాండ్).. జొకోవిచ్‌తో థీమ్ తలపడనున్నారు.
Teen Queen 👑
— Roland-Garros (@rolandgarros) June 6, 2019
Anisimova stuns Halep https://t.co/xWvk9wVKqM📝 #RG19 pic.twitter.com/rNUSK9dF6Y