Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్‌ 'న్యూ లుక్‌' చూశారా?

French Open 2019: Champion, queen, mom & goddess – Serena makes fashion statement with message

పారిస్ వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్‌ 'న్యూ లుక్‌'తో అదరగొట్టింది. ఇంతకుముందు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెరెనా ధరించిన 'బ్లాక్‌ పాంథర్‌' క్యాట్‌ సూట్‌ వివాదాస్పదమైంది. దీంతో ఈసారి జీబ్రా చారలున్న సరికొత్త డ్రెస్‌తో సెరెనా బరిలోకి దిగింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మ్యాచ్ ముందు కోర్టులోకి వచ్చేటప్పడు సెరెనా ధరించిన పైవస్త్రంపై 'అమ్మ, చాంపియన్‌, రాణి, దేవత' అనే పదాలు ఫ్రెంచ్‌ భాషలో రాసి ఉన్నాయి. ఈ పదాలు అక్కడి అభిమానుల అందరినీ ఆకర్షించాయి. ఈ సరికొత్త డ్రెస్ ను విర్గిలబ్లోహ్, నైక్ లు రూపొందించారు. ఈ విషయాన్నీ సెరెనా తన ట్విట్టర్ ద్వారా తెలిపింది.

French Open 2019: Champion, queen, mom & goddess – Serena makes fashion statement with message

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సెరెనా విలియమ్స్‌ శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో పదో సీడ్‌ సెరెనా విలియమ్స్‌ 2-6, 6-1, 6-0తో వితాలియా (రష్యా)పై గెలుపొందింది. తొలి సెట్ కోల్పోయిన సెరెనా.. ఆ తర్వాత తన అనుభవాన్ని ఉపయోగించి వరుసగా రెండు సెట్లు గెలుపొందింది. సెరెనా అక్క వీనస్‌ 6-3, 6-3తో తొమ్మిదో సీడ్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌) చేతిలో ఓడిపోయింది. 22వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పాల్గొన్న వీనస్‌.. 2006 తర్వాత ఈ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ దాటలేకపోయింది.

French Open 2019: Champion, queen, mom & goddess – Serena makes fashion statement with message
French Open 2019: Champion, queen, mom & goddess – Serena makes fashion statement with message
French Open 2019: Champion, queen, mom & goddess – Serena makes fashion statement with message
Story first published: Tuesday, May 28, 2019, 12:01 [IST]
Other articles published on May 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+