ఎటువంటి అంచనాలు లేకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో అడుగుపెట్టి అద్భుత ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా యువ క్రీడాకారిణి యాష్లే బార్టీ (23) తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ బార్టీ 6-1, 6-3తో అన్‌సీడెడ్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)పై ఘన విజయం సాధించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
70 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ వొండ్రుసోవా (19) నుంచి బార్టీకి ప్రతిఘటన ఎదురుకాలేదు. ఫైనల్ చేరే క్రమంలో ఒక్క సెట్ కూడా కోల్పోని వొండ్రుసోవా ఫైనల్ పోరులో నాలుగు గేమ్‌లు మాత్రమే గెలిచింది. ఈ విజయంతో యాష్లే బార్టీ 46 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ కిరీటాన్ని దక్కించుకున్న ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా రికార్డు నమోదు చేసింది. చివరిసారి 1973లో మార్గరెట్ కోర్ట్ ఈ వేదికపై టైటిల్ అందుకుంది.
ఫ్రెంచ్ ఓపెన్ విజేత బార్టీకి ట్రోఫీతో పాటు 23 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 8 లక్షలు), రన్నరప్ వొండ్రుసోవాకు 11 లక్షల 80 వేల యూరోలు (రూ.9 కోట్ల 27 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సోమవారం విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో బార్టీ రెండో స్థానానికి చేరుకుంటుంది.
First Kiss 😘
— Roland-Garros (@rolandgarros) June 8, 2019
The best GIFs from the Women's Final 👉 https://t.co/BvXGy4251z#RG19 pic.twitter.com/r8HNil2Zoc
టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్ జోరుకు బ్రేక్ పడింది. వర్షం వల్ల రెండు రోజుల పాటు సాగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6-2, 3-6, 7-5, 5-7, 7-5 తేడాతో జకోవిచ్‌పై విజయం సాధించాడు. శుక్రవారం వర్షంతో మ్యాచ్ నిలిపివేసే సమయానికి మూడో సెట్లో 3-1తో ఆధిక్యంలో ఉన్న థీమ్.. శనివారం అదే జోరు కొనసాగించి మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. గతేడాది నాదల్, థీమ్ మధ్యే ఫైనల్ జరిగింది. నాదల్ టైటిల్ నెగ్గాడు. ఈ రోజు జరిగే ఫైనల్లో నాదల్ గెలిస్తే రికార్డు స్థాయిలో 12వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంటాడు. ఇక థీమ్ గెలిస్తే ఈ టోర్నీ ఫైనల్లో నాదల్‌ను ఓడించిన తొలి క్రీడాకారిడిగా చరిత్ర సృష్టిస్తాడు.
What. A. Match.
— Roland-Garros (@rolandgarros) June 9, 2019
Get analysis and highlights from @ThiemDomi's 🎢 semi-final victory. #RG19
📝: https://t.co/7wZNDLVwBl pic.twitter.com/Y9sBuczsFq