For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్ ఓపెన్ 2018: జకోవిచ్ 200వ విజయం, సైడ్ అయిపోయిన సెరెనా

 French Open 2018: Serena and Venus Williams crash out of women’s doubles

హైదరాబాద్: జకోవిచ్‌ ఖాతాలో మరో రికార్డు... పురుషుల విభాగంలో నోవాక్‌ జకోవిచ్‌‌(సెర్బియా).. స్పెయిన్‌కు చెందిన ఫెర్నాండో వర్దాస్కోపై 6-3, 6-4, 6-2 తేడాతో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. జకోవిచ్‌కు ఇది క్లే మైదానంలో 200వ విజయం. జకోవిచ్‌ తన తదుపరి మ్యాచ్‌లో ఇటలీకి చెందిన మార్కో కెచ్చినషియోతో తలపడనున్నాడు.

సైడ్ అయిపోయిన సెరెనా:
దిగ్విజయంగా మహిళల సింగిల్ విభాగంలో.. రెండు రౌండ్లు దూసుకుపోయిన సెరెనా డబుల్స్ విభాగంలో ఓటమికి గురైంది. దీంతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీలో సంచలనం చోటు చేసుకుంది. ఉమెన్‌ డబుల్స్‌ విభాగం నుంచి విలియమ్స్‌ సిస్టర్స్‌ నిష్క్రమించారు. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో అండ్రెజా క్లెపాక్‌(స్లోవేనియా)-మరియా జోస్‌ మార్టినెజ్‌(ఇటలీ) చేతిలో ఓటమిపాలయ్యారు. చివరి సెట్‌ను విలియమ్స్‌ సోదరీమణులు చిత్తుగా కోల్పోవటం విశేషం.

మొత్తం మూడు రౌండ్లలో 6-4, 6-7(4), 6-0 తేడాతో ఓడిపోయారు. నిర్ణయాత్మక రౌండ్‌లో కనీస పోటీని కూడా ప్రదర్శించలేకపోయారు. కాగా, సెరెనా-వీనస్‌లు ఇప్పటిదాకా 14 గ్రాండ్‌ స్లామ్‌ డబుల్స్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. సోమవారం మహిళల సింగిల్స్‌ విభాగం నాలుగో రౌండ్‌లో భాగంగా సెరెనా, రష్యన్‌ టెన్నిస్‌ క్వీన్‌ మరియా షరపోవాతో తలపడనుంది. గతంలో వీరిద్దరి 18సార్లు తలపడగా, 16 సార్లు సెరెనా, 2 సార్లు షరపోవా నెగ్గారు.

జ్వెరెవ్‌ నాలుగో రౌండ్లో కరెన్‌ కచనోవ్‌ (రష్యా)ను:
ఫ్రెంచ్‌ ఓపెన్‌ నాలుగో రౌండ్లో రెండో సీడ్‌ జ్వెరెవ్‌ 4-6, 7-6 (7-4), 2-6, 6-3, 6-3తో కరెన్‌ కచనోవ్‌ (రష్యా)ను ఓడించాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ మూడోర్యాంకర్, రెండోసీడ్ జ్వెరేవ్ 4-6, 7-6 (7/4), 2-6, 6-3, 6-3తో ప్రపంచ 38వ ర్యాంకర్ కారెన్ కచనోవ్ (రష్యా)పై గెలిచి క్వార్టర్స్ కలను నెరవేర్చుకున్నాడు. ఈ టోర్నీలో జ్వెరేవ్ ఆడిన మూడో ఐదు సెట్ల మ్యాచ్ కాగా, ప్రిక్వార్టర్స్‌లో ఓడటం కచనోవ్‌కు ఇది వరుసగా రెండోసారి.

Story first published: Monday, June 4, 2018, 13:17 [IST]
Other articles published on Jun 4, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+