Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్రెంచ్ ఓపెన్: ఎదురులేని నాదల్, సెరెనా Vs షరపోవా, క్విటోవా అనూహ్య ఓటమి

 French Open 2018: Ruthless Nadal sends homeboy Gasquet packing; Sharapova thrashes Pliskova

హైదరాబాద్: డోపింగ్ నిషేధం తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ మాజీ చాంపియన్, రష్యా టెన్నిస్‌ స్టార్‌ మరియా షరపోవా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తన జోరుని కొనసాగిస్తోంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడోరౌండ్‌లో 6-2, 6-1తో ఆరోసీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.

2012, 2014లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన షరపోవా.. 2015లో క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన తర్వాత మళ్లీ బరిలోకి దిగలేదు. డోపింగ్ కారణంగా 2016లో నిషేధం ఎదుర్కొన్న ఈ రష్యా భామకు 2017లో నిర్వాహకులు వైల్డ్‌కార్డు ఇవ్వలేదు. కెరీర్‌లో ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన షరపోవా.. ప్లిస్కోవాతో గంటపాటు జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది.

ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించిన షరపోవా

ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించిన షరపోవా

తొలి గేమ్‌ను కేవలం 16 నిమిషాల్లోనే తొలిసెట్‌లో 4-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన షరోపోవా.... బలమైన సర్వీస్‌లతో పాటు అద్భుతమైన బేస్‌లైన్ గేమ్‌తో చెలరేగింది. ఇక, రెండో సెట్‌లో షరపోవా మరింత దూకుడిని ప్రదర్శించింది. ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ దశలో పుంజుకునే ప్రయత్నం చేసిన ప్లిస్కోవా పదేపదే స్మాష్ కొట్టినా.. షరపోవా అద్భుతమైన రిటర్న్ షాట్స్‌తో సెట్‌తో పాటు మ్యాచ్‌ని సొంతం చేసుకుంది.

ఫ్రెంచ్ ఓపెన్: షరపోవా Vs సెరెనా

ఫ్రెంచ్ ఓపెన్: షరపోవా Vs సెరెనా

ఈ మ్యాచ్‌లో 3 ఏస్‌లు కొట్టిన షరపోవా.. ఐదుసార్లు డబుల్ ఫాల్ట్ చేసింది. 19 సార్లు అనవసర తప్పిదాలు చేసినా.. 10 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఐదింటిని కాపాడుకుంది. మూడోరౌండ్‌లో సెరెనా (అమెరికా) 6-3, 6-4తో జార్జెస్ (జర్మనీ)పై గెలిచి.. షరపోవాతో అమీతుమీకి సిద్ధమైంది. వీరిద్దరి ముఖాముఖి రికార్డులో సెరెనా విలియమ్స్ 19-2 ఆధిక్యంలో ఉంది.

పెట్రా క్విటోవా అనూహ్య ఓటమి

పెట్రా క్విటోవా అనూహ్య ఓటమి

ఇతర మ్యాచ్‌ల్లో మరో టాప్‌ ప్లేయర్‌ పెట్రా క్విటోవా (చెక్‌)కు అనూహ్య ఓటమి ఎదురైంది. 5వ సీడ్‌ కొంటావీట్‌ (ఈస్టోనియా) 7-6 (8/6), 7-6 (7/4)తో ఎనిమిదో సీడ్‌ క్విటోవాను అలవోకగా ఓడించింది. ఇక, వరల్డ్ నంబర్ వన్ సిమోనా హాలెప్ (రొమేనియా) 7-5, 6-0తో పెట్కోవిచ్ (జర్మనీ)పై, 3వ సీడ్ ముగురుజా (స్పెయిన్) 6-0, 6-2తో స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై, 7వ సీడ్ గార్సియా (ఫ్రాన్స్) 6-1, 6-3తో బేగ్ (రొమేనియా)పై, 10వ సీడ్ స్టీఫెన్స్ (అమెరికా) 4-6, 6-1, 8-6తో జియోర్జి (ఇటలీ)పై, మెర్టెన్స్ (బెల్జియం) 6-3, 6-1తో గవ్రిలోవా (ఆస్ట్రేలియా)పై అలవోకగా గెలిచి ప్రిక్వార్టర్స్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు.

ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్

ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్

తన కెరీర్‌లో 11వ ఫ్రెంచ్ టైటిల్‌పై కన్నేసిన స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్ మరో అడుగు ముందుకెశాడు. పురుషుల సింగిల్స్ మూడోరౌండ్‌లో టాప్‌సీడ్ నాదల్ (స్పెయిన్) 6-3, 6-2, 6-2తో 27వ సీడ్ రిచర్డ్ గాస్కెట్ (ఫ్రాన్స్)పై గెలిచి ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. గాస్కెట్‌ను ఓడించడం నాదల్‌కు ఇది 16వ సారి. ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుసగా 34 సెట్లు గెలిచిన ఆటగాడిగా కూడా గుర్తింపు పొందాడు. మరో ఏడు సెట్లు గెలిస్తే జోర్న్ బోర్గ్ (1979-81) రికార్డును అధిగమిస్తాడు. గంటా 58 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో.. తొలి ఐదు గేమ్‌ల్లో రెండు మాత్రమే కోల్పోయాడు.

 రామోస్ వినోలాస్‌పై నెగ్గిన 5వ సీడ్ డెల్ పోట్రో

రామోస్ వినోలాస్‌పై నెగ్గిన 5వ సీడ్ డెల్ పోట్రో

ఇతర మ్యాచ్‌ల్లో మూడోసీడ్‌ సిలిచ్ (క్రొయేషియా) 6-3, 6-2, 6-4తో జాన్సన్ (అమెరికా)పై, 5వ సీడ్ డెల్ పోట్రో (అర్జెంటీనా) 7-5, 6-4, 6-1తో రామోస్ వినోలాస్ (స్పెయిన్)పై, 6వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 6-1, 6-7 (3/7), 6-3, 7-6 (7/4)తో జ్వరేవ్ (జర్మనీ)పై, 8వ సీడ్ గోఫిన్ (బెల్జియం) 6-7 (6/8), 6-3, 4-6, 7-5, 6-3తో 32వ సీడ్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)పై, 11వ సీడ్ షుర్జ్‌మెన్ (అర్జెంటీనా) 7-5, 6-3, 6-3తో కోరిచ్ (క్రొయేషియా)పై, 15వ సీడ్ పౌలీ (ఫ్రాన్స్) 3-6, 5-7, 3-6తో ఖచనోవ్ (రష్యా)పై, 18వ సీడ్ ఫోగ్నిని (ఇటలీ) 6-3, 4-6, 3-6, 6-4, 6-4తో 16వ సీడ్ ఎడ్మండ్ (బ్రిటన్)పై, మార్టెర్ (జర్మనీ) 6-2, 6-1, 6-4తో జోప్ (ఈస్టోనియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.

క్వార్టర్స్‌లోకి బోపన్న జోడీ

క్వార్టర్స్‌లోకి బోపన్న జోడీ

పురుషుల డబుల్స్‌లో బోపన్న-వాసెలిన్ జోడీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మూడోరౌండ్‌లో 13వ సీడ్ బోపన్న-వాసెలిన్ 6-4, 7-6 (7/1)తో కుబోట్ (పోలెండ్)-మార్సెల్లో మెలో (బ్రెజిల్)పై విజయం సాధించారు. గంటన్నర పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలిసెట్‌లో ఓ మోస్తరుగా ఆడిన కుబోట్-మెలో జోడి రెండోసెట్‌లో గట్టిపోటీ ఇచ్చింది. క్వార్టర్స్‌లో బోపన్న జోడీ 8వ సీడ్ మెక్టిక్ (క్రొయేషియా)-పియా (ఆస్ట్రియా)తో తలపడుతుంది.

Story first published: Sunday, June 3, 2018, 9:50 [IST]
Other articles published on Jun 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+