న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్ ఓపెన్: పైనల్లోకి హలెప్, రఫెల్ నాదల్ 11వసారి

By Nageshwara Rao

హైదరాబాద్: మహిళల సింగిల్స్‌లో రుమేనియాకు చెందిన సిమోనా హలెప్ నంబర్ వన్ ర్యాంకుని నిలబెట్టుకోవడంతో పాటు ముచ్చటగా మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో టాప్‌సీడ్, ప్రపంచ నంబర్‌వన్ హాలెప్ 6-1, 6-4తో మూడోసీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)పై విజయం సాధించింది.

దీంతో మహిళల సింగిల్స్‌లో తన నంబర్‌వన్ ర్యాంక్‌ను పదిలం చేసుకుంది. 2014, 17లో రన్నరప్‌గా నిలిచిన హలెప్ గంటా 32 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో దూకుడుగా ఆడింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క సెట్ కూడా చేజార్చుకోని ముగురుజాకు తొలిసెట్‌లోనే ఊహించని షాకిచ్చింది. ఇక, రెండోసెట్‌లో ఆరంభంలో ఇద్దరూ సర్వీస్‌లు నిలబెట్టుకున్నా.. మూడో గేమ్‌లో హాలెప్ సర్వీస్‌ను చేజార్చుకుంది.

 ఫైనల్‌కు సిమోనా హలెప్

ఫైనల్‌కు సిమోనా హలెప్

ఆ వెంటనే సర్వీస్‌ను కాపాడుకున్నా.. ముగురుజా కొట్టిన బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లకు కాస్త తడబడింది. దీంతో ఓ దశలో హలెప్ 2-4తో వెనుకబడింది. ఆ తర్వాత పట్టువిడవకుండా పోరాడుతూ ఏడోగేమ్‌లో సర్వీస్‌ను కాపాడుకుని 8వ గేమ్‌లో ముగురుజా సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 4-4 వద్ద సమం చేసింది. దీంతో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం అద్భుతంగా పోరాడారు.

ఆరు బ్రేక్ పాయింట్లను సద్వినియోగం చేసుకున్న హలెప్

ఆరు బ్రేక్ పాయింట్లను సద్వినియోగం చేసుకున్న హలెప్

9వ గేమ్‌లో హాలెప్ క్రాస్‌కోర్టు షాట్లు కొడుతూ సర్వీస్‌ను నిలబెట్టుకుని 5-4 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ముగురుజా సర్వీస్ చేసిన 10వ గేమ్‌లో హాలెప్ మరింత దూకుడుగా ఆడింది. రెండు బలమైన బ్యాక్‌హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిని కట్టడి చేసి సెట్‌తో పాటు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ మొత్తంలో ముగురుజా 8 బ్రేక్ పాయింట్లలో రెండింటిని మాత్రమే సద్వినియోగం చేసుకోగా, హలెప్ పదింటిలో ఆరింటిని కాపాడుకుంది.

మాడిసన్ కీస్‌పై నెగ్గిన స్టోన్‌ స్టీఫెన్స్‌

మాడిసన్ కీస్‌పై నెగ్గిన స్టోన్‌ స్టీఫెన్స్‌

తాజా పరాజయంతో ముగురుజా వరల్డ్‌ నంబర్‌వన్‌ అయ్యే అవకాశం కూడా చేజార్చుకుంది. మరో సెమీస్‌లో ఆమెరికాకు చెందిన స్టోన్‌ స్టీఫెన్స్‌ 6-4, 6-4తో సహచర అమెరికా క్రీడాకారిణి మాడిసన్‌ కీస్‌పై విజయం సాధించింది. 77 నిమిషాల్లో సాగిన ఈ పోరులో స్టీఫెన్స్‌ చక్కటి షాట్లతో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. గంటా 17 నిమిషాల మ్యాచ్‌లో నెట్ వద్ద స్టీఫెన్స్ 87 శాతం పాయింట్లు గెలుచుకుంది. ఏడు బ్రేక్ పాయింట్లలో మూడింటిని కాపాడుకుంది. కీస్ ఒకే ఒక్క బ్రేక్ పాయింట్‌ను సద్వినియోగం చేసుకుంది. 11 అనసవర తప్పిదాలు చేసిన స్టీఫెన్స్ 9 విన్నర్లు సంధించింది. కీస్ 41 అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చుకుంది.

సెమీ ఫైనల్లోకి నాదల్ 11వసారి

సెమీ ఫైనల్లోకి నాదల్ 11వసారి

ఇక, పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ రఫెల్ నాదల్ సెమీస్‌కు చేరుకున్నాడు. వర్షం కారణంగా గురువారం ముగిసిన క్వార్టర్‌ఫైనల్లో టాప్‌సీడ్ నాదల్ (స్పెయిన్) 4-6, 6-3, 6-2, 6-2తో 11వ సీడ్ ష్వార్జ్‌మెన్ (అర్జెంటీనా)పై విజయం సాధించాడు. దీంతో 11వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఫలితంగా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అత్యధిక సార్లు సెమీస్ చేరిన మూడో ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో జిమ్మీ కానర్స్ (యూఎస్ ఓపెన్), ఫెదరర్ (వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్) ఈ ఘనత సాధించారు. మరో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఐదో సీడ్‌ జువాన్‌ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 7-6, 5-7, 6-3, 7-5తో మూడో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)ను ఓడించాడు. 2009 తర్వాత డెల్‌పొట్రో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీస్‌ చేరడం ఇదే మొదటిసారి.

మ్యాచ్‌ ఆగిపోవడం నాకు కొంత వరకు కలిసొచ్చింది

మ్యాచ్ అనంతరం రఫెల్ నాదల్ మాట్లాడుతూ 'వర్షం వల్ల మ్యాచ్‌ ఆగిపోవడం నాకు కొంత వరకు కలిసొచ్చింది. నేను నా వ్యూహాలు మార్చుకునేందుకు అవకాశం కలిగింది. అయితే వర్షమో, సూర్యుడు రావడమో నా విజయానికి కారణం కాదు. నా ఆటను మార్చుకోవడం వల్లే ఈ మ్యాచ్‌ గెలవగలిగాననేది వాస్తవం. మీరు ఒత్తిడిని జయించలేకపోయారంటే ఆటను ఇష్టపడట్లేదనే అర్థం' అని అన్నాడు.

Story first published: Friday, June 8, 2018, 11:55 [IST]
Other articles published on Jun 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X