ఫ్రెంచ్‌ ఓపెన్‌‌లో సంచలనం: వోజ్నియాకి ఓటమి, క్వార్టర్స్‌లో నాదల్

By Nageshwara Rao

హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్‌లో సోమవారం సంచలనం నమోదైంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ గెలిచి జోరుమీదున్న మహిళల ప్రపంచ నెంబర్‌ 2 కరోలిన్‌ వోజ్నియాకి (డెన్మార్క్‌)కి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఏమాత్రం కలిసిరావడం లేదు. ఇప్పటికే రెండుసార్లు క్వార్టర్స్‌లో వెనుదిరిగిన వోజ్నియాకి ఈసారి నాలుగో రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

14వ సీడ్‌, రష్యా యువ సంచలనం 21 ఏళ్ల డారియా కసాట్కినా చేతిలో ఓటమిపాలైంది. సోమవారం జరిగిన నాలుగోరౌండ్ పోరులో 7-6 (7/5), 6-3 స్కోరుతో వరుససెట్లలో విజయంతో వోజ్నియాకిని ఓడించింది. రెండోసెట్ 3-3 స్కోరుతో ఇద్దరూ సమానంగా ఉండగా వెలుతురులేమితో ఈ మ్యాచ్ వాయిదాపడింది.

తొలిసారిగా క్వార్టర్స్ చేరుకున్న కసాట్కినా

తొలిసారిగా క్వార్టర్స్ చేరుకున్న కసాట్కినా

అయితే, సోమవారం కొనసాగిన ఈ మ్యాచ్‌లో కేవలం 17 నిమిషాల్లోనే మూడో సెట్ పాయింట్లతోపాటు మ్యాచ్‌ను కసాట్కినా సొంతం చేసుకుంది. ఈ ఏడాది వోజ్నియాకిపై తాను ఒక్క సెట్‌ కూడా కోల్పోక పోవడం విశేషం. తద్వారా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారిగా క్వార్టర్స్ చేరుకున్న ఘనతను అందుకుంది. క్వార్టర్స్‌లో స్లోన్‌ స్టీఫెన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

క్వార్టర్‌ ఫైనల్లోకి సిమోన్ హలెప్

క్వార్టర్‌ ఫైనల్లోకి సిమోన్ హలెప్

మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, టాప్‌సీడ్ రుమేనియన్ సిమోనా హలెప్ అలవోక విజయంతో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ హలెప్‌ 6-2, 6-1తో 16వ సీడ్‌ ఎలీజ్‌ మెర్‌టెన్స్‌ (బెల్జియం)పై విజయం సాధించింది. 59 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో హలెప్‌ ఆరు బ్రేక్‌ పాయింట్లు సాధించడంతోపాటు నెట్‌ వద్దకు 10 సార్లు వచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు గెలిచింది.

క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడోసారి

క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడోసారి

గత ఐదేళ్లలో ఈ టోర్నీలో హలెప్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడోసారి. క్వార్టర్‌ ఫైనల్లో మాజీ నంబర్‌వన్, 12వ సీడ్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ)తో హలెప్‌ తలపడుతుంది. ప్రీక్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన సురెంకో రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరగడంతో మూడోసీడ్‌, స్పెయిన్ స్టార్ ముగురుజా క్వార్టర్స్ చేరింది. క్వార్టర్స్‌లో షరపోవాతో ముగురుజా తలపడనుంది.

గాయంతో సెరెనా దూరం: షరపోవాకు వాకోవర్

గాయంతో సెరెనా దూరం: షరపోవాకు వాకోవర్

రోలాండ్ గారోస్‌లో షరపోవా, సెరెనా విలియమ్స్‌ల మధ్య పోరాటం చూడాలనుకున్న టెన్నిస్ అభిమానులకు నిరాశే మిగిలింది. మ్యాచ్‌కుకొన్ని నిమిషాల ముందు భుజం కండరాలు పట్టేయడంతో సెరెనా కోర్టులోకి అడుగు పెట్టకుండానే షరపోవాకు ‘వాకోవర్‌' ఇచ్చింది. దాంతో షరపోవా బరిలోకి దిగకుండానే క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. అనంతరం సెరెనా మాట్లాడుతూ 'భుజం కండరాలు పట్టేయడంతో సర్వీస్‌ చేసే పరిస్థితిలో లేను. టోర్నీకి ముందు ఈ సమస్య లేదు. జూలియా జార్జెస్‌తో జరిగిన మూడో రౌండ్‌లో భుజం నొప్పి మొదలైంది. గాయం కారణంగా వైదొలుగుతున్నందుకు చాలా బాధగా ఉంది' అని ఆవేదన వ్యక్తం చేసింది.

 క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన రఫెల్ నాదల్

క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన రఫెల్ నాదల్

ఇక, పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌, స్పెయిన్ బుల్ రఫెల్‌ నాదల్‌ 34వ సారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ నాదల్‌ 6-3, 6-2, 7-6 (7/4)తో మాక్సిమిలియన్‌ మార్టెరర్‌ (జర్మనీ)పై గెలుపొందాడు. నాదల్‌ కెరీర్‌లో ఇది 900వ విజయం కావడం విశేషం. ఈ క్రమంలో ఓపెన్‌ శకంలో (1967 తర్వాత) కనీసం 900 విజయాలు సాధించిన ఐదో ప్లేయర్‌గా నాదల్‌ గుర్తింపు పొందాడు. జిమ్మీ కానర్స్‌ (అమెరికా-1,256), ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌-1,149), లెండిల్‌ (అమెరికా-1,068), గిలెర్మో విలాస్‌ (అర్జెంటీనా-948) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, June 5, 2018, 10:36 [IST]
Other articles published on Jun 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X