Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి గ్రాండ్ స్లామ్ ట్రోఫీ అందుకున్న హలెప్, రొమేనియా తరపున 2వ ప్లేయర్‌గా..

French Open 2018: Champion Simona Halep thought chance to win had gone

హైదరాబాద్: 'పద్నాలుగేళ్ల వయసు నుంచి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలవాలనుకుంటున్నా. నా కల నెరవేరింది. అది పారిస్‌లో కావడం నా విజయానికి మరింత ప్రత్యేకతను చేకూరుస్తోంది. రెండో సెట్లో వెనుకబడ్డాక ప్రశాంతంగా ఉండి, ఆటను ఆస్వాదించడానికి ప్రయత్నించా.' ఇవి ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని అందుకున్న తర్వాత సిమోనా హలెప్ పలికిన మాటలు. తొలి గ్రాండ్‌స్లామ్‌ కోసం ఏళ్లుగా శ్రమిస్తూనే ఉంది. అందినట్లే అంది చేజారినా నిరాశచెందక పోరాడుతూనే ఉంది. ఇప్పుడు ఎట్టకేలకు ఆమె కల ఫలించింది. అద్భుతంగా పోరాడిన రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో మురిసిపోయింది.

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ట్రోఫీని ముద్దాడింది.

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ట్రోఫీని ముద్దాడింది.

ఫైనల్లో స్టీఫెన్స్‌ను ఓడించి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ట్రోఫీని ముద్దాడింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఆమె 3-6, 6-4, 6-1తో అమెరికా అమ్మాయి స్లోన్‌ స్టీఫెన్స్‌ను మట్టికరిపించింది. రెండు ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్స్‌ సహా గతంలో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌ చేరిన హలెప్‌.. అన్నింట్లోనూ ఓడిపోయింది. ఈసారి మాత్రం అవకాశం వదల్లేదు. సుదీర్ఘ ర్యాలీల్లో హోరాహోరీగా తలపడింది. తొలి సెట్‌ను చేజార్చుకున్నా, రెండో సెట్లో 2-0తో వెనుకబడ్డా బలంగా పుంజుకుంది. గొప్ప పోరాటంతో రెండుగంటలకుపైగా సాగిన పోరాటంలో విజేతగా నిలిచింది.

తొలి రొమేనియా ప్లేయర్‌గా 26 ఏళ్ల హలెప్‌

తొలి రొమేనియా ప్లేయర్‌గా 26 ఏళ్ల హలెప్‌

వర్జినా రుజుకి (1978) తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన తొలి రొమేనియా ప్లేయర్‌గా 26 ఏళ్ల హలెప్‌ ఘనత సాధించింది. గతంలో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ (రెండుసార్లు ఫ్రెంచ్, ఒకసారి ఆస్ట్రేలియన్)కు చేరిన రొమేనియన్.. ఎట్టకేలకు నాలుగోసారి టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ఇదే వేదికపై 2014లో షరపోవా చేతిలో, 2017లో ఓస్టాంఫెకో చేతిలో ఓటమి చవిచూసిన హలెప్.. ఈసారి మాత్రం పాత ఫలితాన్ని పునరావృతం కానివ్వలేదు. రొమేనియా తరఫున గ్రాండ్‌స్లామ్ గెలిచిన రెండో ప్లేయర్‌గా హలెప్ రికార్డులకెక్కింది. గతంలో విర్జినియా రుజిక్ ఈ ఘనత సాధించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ హలెప్ రన్నరప్‌గా నిలిచింది.

కోర్టులో ఏమైనా చేయగలననే నమ్మకం పెరిగి

కోర్టులో ఏమైనా చేయగలననే నమ్మకం పెరిగి

గేమ్ విజయానంతరం హలెప్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఫైనల్ పోరులో ఒకానొక సందర్భంలో ఓడిపోతాను అనుకున్నాను. ఈ ట్రోఫీలో వరుసగా గేమ్స్ గెలుస్తుండటంతో గతేడాది చేరినట్లు ఫైనల్‌కు చేరతాననే నమ్మకం కలిగింది. తద్వారా ఫైనల్‌లో గెలవాలనే కసి పెరిగింది. ఇప్పుడు నేను కోర్టులో ఏమైనా చేయగలననే నమ్మకం పెరిగింది. ఆడేంతసేపు చాలా ప్రశాంతంగా ఆడగలిగాను. ట్రోఫీ అందుకున్నాక మాట రావడం లేదు' అని తెలిపింది.

మెరుగ్గా ఆడినవాళ్లే ఛాంపియన్ అవుతారు:

మెరుగ్గా ఆడినవాళ్లే ఛాంపియన్ అవుతారు:

ఫైనల్‌లో గటిపోటినిచ్చిన అమెరికన్ ప్లేయర్ స్టీఫెన్స్ మాట్లాడుతూ.. 'హలెప్ ఆటను నిలబెట్టుకుంది. అంత సులువుగా ఏం వదులుకోలేదు. నా వల్ల అయినంతవరకూ కష్టపడ్డాను. మెరుగ్గా ఆడినవాళ్లే ఛాంపియన్ అవుతారు. తన కెరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్ అందుకుంది. చాలా శ్రమించి ఈ ట్రోఫీని అందుకోవడం తనకు ఓ ప్రత్యేకమైన అనుభూతి. ప్రతి కష్టం వెనుక ఓ అద్భుతమైన విజయం ఉంటుంది. ఈ రోజు ఆమెకు ఆ అవకాశం దక్కింది.' అని క్రీడా స్ఫూర్తితో హలెప్ విజయాన్ని కొనియాడింది.

Story first published: Sunday, June 10, 2018, 15:07 [IST]
Other articles published on Jun 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+