ముచ్చెమటలు పట్టించిన ఇటలీ ప్లేయర్, జకోవిచ్‌కు చుక్కెదురు


హైదరాబాద్: కెరీర్‌లో రెండో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కోసం బరిలోకి దిగిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ జొకోవిచ్‌కు చుక్కెదురైంది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో 20వ సీడ్ జొకోవిచ్ మంగళవారం హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ఫైనల్లో అన్‌సీడెడ్ మార్కో సిక్చినాటో (ఇటలీ) చేతిలో పరాజయంపాలయ్యాడు. తొలి రెండు సెట్లు కోల్పోయిన జకోవిచ్... బలంగా పుంజుకుని మూడో సెట్‌ను అలవోకగా గెలుచుకున్నాడు. నాలుగో సెట్ హోరాహోరీగా సాగింది.
జొకోవిచ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో:
దాదాపు మూడున్నర గంటపాటు సాగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. బ్యాక్‌హ్యాండ్, ఫోర్‌హ్యాండ్ షాట్లలో తప్పిదాలు చేస్తూ మూల్యం చెల్లించుకున్నాడు. బలమైన సర్వీస్‌లు కొట్టినా.. ఇటాలియన్ ఇచ్చిన ప్రతి ఘటన ముందు దూదిపింజలా తేలిపోయాడు. టైబ్రేకర్‌లో మూడు మ్యాచ్ పాయింట్లను కాచుకున్నా జకోవిచ్ ఓటమిని తప్పించుకోలేకపోయాడు.
40 ఏళ్లలో సెమీస్ చేరిన తొలి ఇటలీ ఆటగాడిగా:
మ్యాచ్‌లో సెచినాటో మొత్తం ఆరు ఏస్‌లు సంధించాడు. ఈ విజయంతో అతడు గత 40 ఏళ్లలో రొలాండ్‌గారోస్ పురుషుల సింగిల్స్ సెమీస్ చేరిన తొలి ఇటలీ ఆటగాడిగా ఘనత సాధించాడు. తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సిక్చినాటో 4-5తో నిలిచాడు. ఈ వెంటనే సర్వీస్‌ను కాపాడుకోవడంతో 5-5తో స్కోరు సమమైనా.. తర్వాతి రెండు గేమ్‌ల్లో చెరోసారి సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో స్కోరు 6-6తో సమమైంది.
టైబ్రేక్ అనివార్యమైన సమయంలో.. :
టైబ్రేక్ అనివార్యమైన సమయంలో.. దాదాపు 30 నిమిషాలు సాగిన టైబ్రేక్‌లో సిక్చినాటో చేసిన పోరాటానికి జొకోవిచ్ అనుభవంతో దెబ్బకొట్టాలని ప్రయత్నించాడు. కానీ వ్యూహాత్మకమైన షాట్లతో ఇటాలియన్ 3-0 ఆధిక్యంలోకి వెళ్లినా.. జొకో కొట్టిన క్రాస్ కోర్టు షాట్లతో ఓ దశలో స్కోరు 3-3, 4-4, 5-5, 6-6... 11-11తో ముందుకెళ్లింది.
ఫోర్‌హ్యాండ్ షాట్ వైడ్‌గా వెళ్లడం:
ఈ దశలో జొకో కొట్టిన ఫోర్‌హ్యాండ్ షాట్ వైడ్‌గా వెళ్లడం, ఆ వెంటనే తన సర్వీస్‌లో సిక్చినాటో కొట్టిన బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌ను జొకోను దాటుకుని వెళ్లడంతో ఇటాలియన్ చిరస్మరణీయం విజయం సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన జకోవిచ్.. తాను వింబుల్డన్‌లో ఆడతానో లేదో తెలియదని మ్యాచ్ అనంతరం జకోవిచ్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతానికి తాను టెన్నిస్ గురించి మాట్లాడాలనుకోవట్లేదని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications