న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్నాళ్లకెన్నాళ్లకు: డేవిస్‌కప్‌ విజేతగా ఫ్రాన్స్‌

By Nageshwara Rao
France win 10th Davis Cup title by beating Belgium 3-2 in the final

హైదరాబాద్: డేవిస్ కప్‌ను ఫ్రాన్స్ కైవసం చేసుకుంది. ఆదివారం లిల్లీ వేదికగా జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ ఆటగాళ్లు 3-2తో బెల్జియంను ఓడించింది. ఆదివారం జరిగిన ఆఖరి సింగిల్స్ మ్యాచ్‌లో లూకాస్‌ పౌలె 6-3, 6-1, 6-0తో స్టీవ్‌ డాక్రిస్‌ను ఓడించి ఫ్రాన్స్‌కు అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు.

తొలి సింగిల్స్‌లో బెల్జియం స్టార్‌ గోఫిన్‌.. పౌలెపై గెలవగా, రెండో సింగిల్స్‌లో సోంగా.. డాక్రిస్‌ను ఓడించాడు. దీంతో డేవిస్ కప్ రేసులోకి ఫ్రాన్స్ వచ్చింది. ఇక, డబుల్స్‌లో గాస్క్వెట్‌-హెర్బర్ట్‌ జోడీ బెల్స్‌మన్స్‌-జోరిస్‌ లూరె జోడీని ఓడించింది.

దీంతో ఫ్రాన్స్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక, తొలి రివర్స్‌ సింగిల్స్‌లో సోంగా... గోఫిన్‌పై గెలవడంతో స్కోరు 2-2తో సమమై ఉత్కంఠ రేగింది. అదే సమయంలో రెండో రివర్స్‌ సింగిల్స్‌లో పౌలె విజయం సాధించడంతో ఫ్రాన్స్‌కు టైటిల్‌ ఖాయమైంది.

France beat Belgium in fifth rubber for 10th title

ఫ్రాన్స్ డేవిస్ కప్ గెలవడం ఇది పదోసారి కాగా 2001 తర్వాత మాత్రం ఇదే తొలిసారి. అంతకముందు 2002, 2010, 2014లో ఫైనల్స్‌కు చేరినప్పటికీ ఓటమిపాలైంది. యన్నిక్ నోహ్ ఫ్రాన్స్‌కు చివరిసారిగా గ్రాండ్ స్లామ్ టైటిల్ అందించిన కెప్టెన్‌. 16ఏళ్ల తర్వాత మళ్లీ ఫ్రాన్స్ డేవిడ్ కప్ విజేతగా నిలిచింది.

Story first published: Monday, November 27, 2017, 11:27 [IST]
Other articles published on Nov 27, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X