అందగత్తెను మిస్ అవుతున్నాం: టెన్నిస్‌కు ఇవనోవిచ్ వీడ్కోలు
హైదరాబాద్: మహిళల టెన్నిస్‌లో క్రీడాకారిణుల్లో అందంగా ఉంటే సెర్బియాకు చెందిన అనా ఇవనోవిచ్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. మాజీ వరల్డ్ నెంబర్ వన్ అయిన ఇవనోవిచ్ బుధవారం (డిసెంబర్ 28)నాడు తన ఫేస్ బుక్ పేజీలో రిటైర్మెంట్ ప్రకటించింది.
గాయాల వల్లే తాను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని, ఫిట్‌నెస్ సమస్యల వల్ల వంద శాతం ప్రదర్శన ఇవ్వలేకపోతున్నానని ఇవనోవిచ్ పేర్కొంది. 29 ఏళ్ల ఇవనోవిచ్ 2004లో తొలి గ్రాండ్‌స్లామ్ ఆడింది. 2008లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి 12 వారాల పాటు వరల్డ్ నెంబర్ వన్‌గా ఉంది.
అంతేకాదు తన కెరీర్‌లో ఏకైక గ్రాండ్‌స్లామ్ (ఫ్రెంచ్ ఓపెన్)ని కూడా ఆ ఏడాదే గెలిచింది. అయితే ఆ తర్వాత ఆమె అంచనాలకు తగ్గట్లుగా ఆడకపోవడంతో మెల్లమెల్లగా ఇవనోవిచ్ ప్రదర్శన, ర్యాంకు దిగజారుతూ వచ్చింది. ఈ ఏడాది ఆమె ర్యాంకు 25కు పైగా దాటిపోవడం విశేషం.

'ఫ్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఇది చాలా కఠిన నిర్ణయమే అయినప్పటికీ తప్పలేదు. 15 డబ్ల్యూటీఏ టైటిళ్లు గెలిచాను. ఫెడ్ కప్ ఫైనల్స్‌తో పాటు మూడు గ్రాండ్ స్లామ్ పైనల్స్ ఆడాను. గాయాల కారణంగా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాను. అందుకే వీడ్కోలు పలుకుతున్నాను' అని ఇవనోవిచ్ తన రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొంది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన యుఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఇవనోవిచ్ వైదొలిగింది. ఇదిలా ఉంటే చివరగా ఇవనోవిచ్ ఈ నెలలో భారత్‌లో జరిగిన ఐపీటీఎల్ టోర్నీలో ఆడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications