
హైదరాబాద్: ప్రపంచ టెన్నిస్‌లో పరిచయం అక్కర్లేని పేరు మరియన్ బర్తోలి. ప్రాన్స్‌కు చెందినమరియన్ బర్తోలి 2013లో వింబుల్డన్ గెలిచిన ఒక్క నెల తర్వాత అనూహ్యంగా ఆటకు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆ తర్వాత కామెంటేటర్‌గా మారిన 33 ఏళ్ల బర్తోలి నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ తాను టెన్నిస్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. 'మీకో విషయం చెబుతున్నాను. నేను మళ్లీ వస్తున్నా. రాకెట్ పడుతున్నా. ఇది నాకు అతి పెద్ద సవాల్' అని బర్తోలి తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.

'ఇది నాకు అతిపెద్ద ఛాలెంజ్. ఇందుకోసం నేను ప్రస్తుతం కఠినంగ్ ప్రాక్టీస్ అవుతున్నా. ప్రస్తుతం పరిస్థితులను బట్టి మార్చి నాటికి అంటే మియామి ఓపెన్‌కు సిద్ధమవుతానేమో' అని బర్తోలి తెలిపింది. ఇదిలా ఉంటే బర్తోలి రెండేళ్ల క్రితం అంతు చిక్కని వైరస్ బారిన పడి దాదాపు చావు అంచుల వరకు వెళ్లింది.
గతంలో టెన్నిస్ ఆడే సమయంలో బొద్దుగుమ్మగా ఉన్న బర్తోలి.. తీవ్ర అనారోగ్యం కారణంగా సన్నబడి ఏకంగా 35 కిలోల బరువుకు చేరుకుంది. బర్తోలి తన సుదీర్ఘ కెరీర్‌లో ఎనిమిది డబ్ల్యూటీఏ టైటిళ్లను గెలుచుకుంది. కెరీర్‌లో ఆమె సాధించిన అత్యధిక ర్యాంకు 7.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.