జొహన్నెస్‌బర్గ్: మైనర్ బాలికలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో టెన్నిస్ మాజీ ఆటగాడు, బాబ్ హెవిట్‌కు దక్షిణాఫ్రికా కోర్టు ఆరేళ్ల జైలుశిక్ష విధించి.
75ఏళ్ల హెవిట్ 1980-90 మధ్య కాలంలో కోచ్‌గా ఉన్నప్పుడు తన దగ్గర టెన్నిస్ పాఠాలు నేర్చుకుంటున్న కొంతమంది అమ్మాయిలను లైంగికంగా వేధించడంతో పాటు, ముగ్గురిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలు కోర్టులో రుజువయ్యాయి.
దీంతో హెవిట్‌ను దోషిగా నిర్ధారించిన సౌతాఫ్రికా కోర్టు అతనికి ఆరేళ్ల జైల శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించింది. ఆస్ట్రేలియాలో జన్మించి సౌతాఫ్రికా తరపున టెన్నిస్ ఆడిన హెవిట్ 1960-70లో డబుల్స్‌లో 3 గ్రాండ్‌స్లామ్‌లు, మిక్స్‌డ్‌లో 6గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సాధించాడు.

భారత నెంబర్ వన్‌గా యుకి
ఢిల్లీ: యువ ఆటగాడు యుకి బాంబ్రి భారత నెంబర్‌వన్ సింగిల్స్ టెన్నిస్ ఆటగాడికి నిలిచాడు. తాజా సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అతను 158వ ర్యాంకులో నిలిచాడు. సమర్‌కంద్ ఛాలెంజర్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన యుకి 22 స్థానాలు మెరుగుపరుచుకుని సోమ్‌దేవ్ (172)ను అధిగమించాడు.
సాకేత్ మైనేని కెరీర్‌లో తొలిసారి టాప్-200లోకి ప్రవేశించాడు. అతను 196వ ర్యాంకు సాధించాడు. డబుల్స్‌లో బోపన్న20వ స్థానంలో నిలవగా, లియాండర్ పేస్ 27వ ర్యాంకు సాధించాడు. మహిళల డబుల్స్‌లో సానియానెంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతోంది.