Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అవినీతి కేసులో టెన్నిస్ ఆటగాడిపై ఏడేళ్ల పాటు నిషేధం

హైదరాబాద్: అవినీతి ఆరోపణల కేసులో ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారుడు నిక్‌ లాండాపై ఏడేళ్ల పాటు నిషేధం విధించారు. దీంతో పాటు 35,000 అమెరికా డాలర్ల జరిమానా కూడా విధించారు. ఆస్ట్రేలియాలో 2013లో నిర్వహించిన ఓ ఫూచర్స్‌ మ్యాచ్‌ ఫలితం కావాలని మార్చేశాడన్న కేసులో నిందితుడిగా నిక్ ఉన్నాడు.

ఈ కేసుపై టెన్నిస్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ నిర్వహించిన దర్యాప్తులో నిక్ పూర్తిగా విఫలమయ్యాడు. విచారణలో భాగంగా ఫొరెన్సిక్‌ పరీక్షల నిమిత్తం నిక్ తన మొబైల్‌ ఫోన్‌ను కూడా ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో నిక్ అవినీతికి పాల్పడ్డాడని ధ్రువీకరించిన టెన్నిస్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ అతడిపై ఏడేళ్ల పాటు నిషేధం విధించింది.

Former Australian tennis player gets seven-year ban for corruption

ఈ మ్యాచ్‌కు సంబంధించిన కేసులో గతేడాది ఆస్ట్రేలియా కోర్టు నిక్‌కు 1000 ఆస్ట్రేలియా డాలర్ల జరిమానా విధించింది. కాగా, ఈ టోర్నీలో ఆడిన మరో ఇద్దరు ఆటగాళ్లు బ్రండన్ వాకిన్, ఇస్సాక్ ప్రోస్ట్‌లపై క్రమశిక్షణ ఉల్లంఘనల కింద చర్యలు తీసుకున్నారు. తన కెరీర్‌లో అత్యున్నతంగా 187వ ర్యాంకుకు చేరుకున్న నిక్ 2013లో టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+