టెన్నిస్ స్టార్ మరియా షరపోవా సంచలన నిర్ణయం!

న్యూఢిల్లీ: పదహారేళ్ల క్రితం టీనేజర్‌గా వింబుల్డన్‌ చాంపియన్‌గా అవతరించి మహిళల టెన్నిస్‌లో మెరుపుతీగలా దూసుకొచ్చిన రష్యా స్టార్‌ మరియా షరపోవా.. సంచలన నిర్ణయంతో యావత్ క్రీడాలోకాన్ని విస్మయపరిచింది. ప్రొఫెషనల్ టెన్నిస్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ఈ 32 ఏళ్ల టెన్నిస్టార్ బుధవారం ప్రకటించింది. ఇకపై కోర్టులో అడుగుపెట్టడం లేదని వానిటీఫెయిర్‌ వెబ్‌సైట్‌కు తెలిపింది. తీవ్రమైన భుజం నొప్పితోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

నన్ను క్షమించు నీకిక వీడ్కోలు..

నన్ను క్షమించు నీకిక వీడ్కోలు..

ఐదు సార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆమె తన రిటైర్మెంట్‌ గురించి ప్రకటిస్తూ భావోద్వేగానికి గురైంది. ‘తెలిసిన ఒకే ఒక జీవితాన్ని ఎలా వదులుకోవాలి? చిన్నప్పటి నుంచి ఆడుతున్న టెన్నిస్ కోర్టులను విడిచి వెళ్లడం ఎలా? టెన్నిస్.. చెప్పుకోలేని దుఃఖాలు, మాటల్లో వర్ణించలేని ఆనందాలు ఇచ్చింది. ఈ ఆట నాకో కుటుంబాన్ని ఇచ్చింది. 28 ఏళ్ల పాటు వెన్నంటి నడిచిన అభిమానులను అందించింది. ఈ ఆటను ఎలా వదిలి వెళ్లాలి. ఇది చాలా బాధాకరం. టెన్నిస్.. ఇక గుడ్‌బై' అని షరపోవా భావోద్వేగం చెందింది.

ఇండియన్ గర్ల్‌తో మ్యాక్స్‌వెల్ ఎంగేజ్‌మెంట్!!

14 ఏళ్లకే వింబుల్డన్ చాంపియన్..

2004లో కేవలం 14 ఏళ్ల వయసున్నపుడే షరపోవా వింబుల్డెన్ ఛాంపియన్‌షిప్ గెలిచి సంచలనం సృష్టించారు. ఆ తరువాత 2006లో యూస్ ఓపెన్, 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి రికార్డుల మోత మోగించారు. ఇక 2012, 2014లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్‌లలో షరపోవా ప్రదర్శన ఆమె కెరీర్‌లో అత్యుత్తమమైనదిగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది. మొత్తం తన కెరీర్‌లో 36 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకుంది. ఒకప్పుడు అగ్రస్థానంలో కొనసాగిన షరపోవా.. 373 ర్యాంకుతో వీడ్కోలు పలకడం గమనార్హం.

కుంగదీసిన నిషేధం..

ఆటతోనే కాకుండా అందంతోనూ అభిమానులను సొంతం చేసుకున్న షరపోవా కెరీర్‌ను 15 నెలల నిషేధం కుంగదీసింది. వైద్యం కోసం నిషేధిత ఉత్ప్రేరకం 'మెల్డోనిన్‌' ఉన్న ఔషధాన్ని తెలియక తీసుకున్నానని ఆమె చెప్పింది. కేవలం నాలుగు వారాలు నిషేధించిన మెల్డోనియం పేరుతో తనను ఉచ్చులో పడేశారని ఆరోపించింది. తాను కేసు గెలవకపోయి ఉంటే నాలుగేళ్లు నిషేధం విధించేవారని వెల్లడించింది. 2006-2012 మధ్య ఈ టెన్నిస్‌ తార నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచింది. 2014లో వింబుల్డన్‌ కైవసం చేసుకుంది. పునరాగమనం తర్వాత ఆమె తన మునుపటి సత్తా చాటలేకపోయింది.

చివరిసారిగా..

చివరిసారిగా..

ఇక‘వైల్డ్‌ కార్డు'తో ఈ సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌‌లో అడుగుపెట్టిన షరపోవా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ప్రపంచ 20వ ర్యాంకర్‌ డోనా వెకిచ్‌ (క్రొయే షియా)తో జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 145వ ర్యాంకర్‌ షరపోవా 3-6, 4-6తో ఓడిపోయింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో షరపోవా ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు, 31 అనవసర తప్పిదాలు చేసి ఓటమిపాలైంది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, February 26, 2020, 20:40 [IST]
Other articles published on Feb 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X