జొకోవిచ్ #1 - ఐదు ఈవెంట్లు.. నాలుగు టైటిళ్లు.. రెండు గ్రాండ్ స్లామ్స్

హైదరాబాద్: ఐదు ఈవెంట్లు... నాలుగు టైటిళ్లు... రెండు గ్రాండ్ స్లామ్స్.... చివరకు ఏటీపీ ర్యాంకుల్లో అగ్రస్థానం. ఇదీ ఈ ఏడాది సెర్బియా ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ప్రస్థానం. గత కొంతకాలంగా ఊహించిన రీతిలో జొకోవిచ్ మళ్లీ పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్ ర్యాంకు సాధించాడు.
ఈ ఏడాది జూన్‌లో 22వ ర్యాంకులో ఉన్న జొకోవిచ్.. అక్టోబరు నెలాఖరుకు వచ్చేసరికి నంబర్‌వన్ ర్యాంకులో నిలిచాడు. సోమవారం ప్రకటించబోయే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ వరల్డ్ నంబర్‌వన్ స్థానానికి చేరుకోనున్నాడు. కడుపు నొప్పితో పారిస్ మాస్టర్స్ టోర్నీనుంచి రాఫెల్ నాదల్ అనూహ్యంగా తప్పుకోవడంతో సరిగ్గా రెండేళ్ల తర్వాత నొవాక్‌కు నంబర్‌వన్ ఖాయమైంది.
బుధవారం వరకు టెన్నిస్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న రఫెల్ నాదల్ గాయం కారణంగా పారిస్ మాస్టర్స్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఒక్కసారిగా ర్యాంకింగ్ పాయింట్లు తగ్గడంతో తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. దీంతో రెండో స్థానంలో ఉన్న జొకోవిచ్ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు.
ఫలితంగా 2000లో మారత్ సఫిన్ (38వ ర్యాంక్) తర్వాత సీజన్ ప్రారంభమైనప్పుడు 20కంటే ఎక్కువ ర్యాంక్‌లో ఉండి నంబర్‌వన్‌గా సీజన్‌ను ముగిస్తున్న తొలి ఆటగాడిగా జొకోవిచ్ నిలిచాడు. ఈ ఏడాది అద్భుతంగా రాణించిన నొవాక్ జొకోవిచ్ మొదట వింబుల్డన్ సాధించాడు. ఆ తర్వాత యుఎస్ ఓపెన్ టైటిళ్లు సాధించి ర్యాంకుల్లో వేగంగా ఎగబాకాడు.
వింబుల్డన్ (జులై 2-15) - ఛాంపియన్
ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో ప్రత్యర్థి, దక్షిణాఫ్రికా ఆటగాడు అండర్సన్‌పై 6-2, 6-2, 7-6తో విజయం సాధించాడు. కెరీర్‌లో జకోవిచ్‌కి ఇది నాలుగో వింబుల్డన్ టైటిల్‌కాగా.. మొత్తంగా ఇది 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ సెర్బియా స్టార్ చాలా రోజుల తర్వాత.. తన మునుపటి ఆటతీరుతో అభిమానుల్ని అలరించాడు. తొలి రెండు సెట్లలోనూ తడబడిన అండర్సన్ మూడో సెట్‌లో అనూహ్యంగా పుంజుకున్నాడు. ప్రత్యర్థి జకోవిచ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో మూడో సెట్ 6-6తో సమమైంది. దీంతో మ్యాచ్ టై బ్రేక్ దారితీసింది. అయితే, విపరీతమైన ఒత్తిడికి లోనైన అండర్సన్ చివర్లో పట్టుతప్పాడు. దీంతో 7-3తో జకోవిచ్ ఆధిక్యత ప్రదర్శించి మూడో సెట్‌లో 7-6తో నిలిచాడు. దీంతో వరుసగా మూడు సెట్లు గెలిచిన జకోవిచ్ విజయకేతనం ఎగురవేశాడు.

సిన్సినాటి మాస్టర్స్ (ఆగష్టు 13-19) - ఛాంపియన్
అమెరికాలోని సిన్సినాటిలో ఆగస్టు 20న జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో జొకోవిచ్ 6-4, 6-4తో రోజర్ ఫెడరర్‌పై విజయం సాధించాడు. దీంతో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)లో తొమ్మిది మాస్టర్స్ సిరీస్-1000 టైటిల్స్‌ను గెలుచుకున్న తొలి క్రీడాకారుడుగా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. 1990 నుంచి మాస్టర్స్ సిరీస్ టోర్నీలు నిర్వహిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది టోర్నీలు ఈ జాబితాలో ఉన్నాయి. గ్రాండ్‌స్లామ్‌ల తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న టోర్నీలుగా మాస్టర్స్ టోర్నమెంట్‌లకు గుర్తింపు ఉంది.

యుఎస్ ఓపెన్ (ఆగస్టు 27- సెప్టెంబర్ 9)
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ యుఎస్ ఓపెన్ ఫైనల్లో అర్జెంటీనాకు చెందిన జువాన్ మార్టిన్ డెల్‌పొట్రోపై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు. దీంతో ముచ్చటగా మూడోసారి యుఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అమెరికన్ టెన్నిస్ దిగ్గజం పీట్ సంప్రాస్ రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. 2017, ఈ ఏడాది ప్రథమార్థ వరకు వ్యక్తిగత సమస్యలు, గాయాలతో సతమతమై జొకోవిచ్.. వాటిని అధిగమించి 2018 వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్నాడు. యుఎస్ ఓపెన్‌లోనూ అదే జోరును కొనసాగించి టైటిల్ గెలిచాడు. యూఎస్ ఓపెన్ 2007, 2012లో డెల్‌పోట్రోను వరుస సెట్లలో ఓడించిన జొకోవిచ్, 2018లోనూ వాటిని పునరావృతం చేశాడు.

షాంఘై మాస్టర్స్ (అక్టోబర్ 8-14) - ఛాంపియన్
చైనాలోని షాంఘైలో అక్టోబర్ అక్టోబర్ 14న ఫైనల్లో జొకోవిచ్ 6-3, 6-4తో బోర్నా కొరిచ్(క్రొయేషియా)పై గెలుపొందాడు. మరోవైపు పురుషుల డబుల్స్ ఫైనల్లో లుకాస్ కుబట్, మార్సెలో మిలో జోడీ 6-4, 6-2తో జేమీ ముర్రే, బ్రూనో సోర్స్‌పై నెగ్గి టైటిల్ సొంతం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications