Sania Mirza: సూపర్ ఉమెన్‌గా ఉండటం అంత సులభం కాదని చాలా మంది అంటున్నారు.. కానీ సానియా మీర్జా తన జీవితంలో సూపర్ ఉమెన్ అని నిరూపించుకుంది. ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్, టెన్నిస్ ఐకాన్ అయిన సానియా మీర్జా కోర్టులోనే కాకుండా బయట కూడా తనదైన ముద్ర వేసింది. సానియా తన అధ్యాయంలో ఆటపై దృష్టిపెట్టడమే కాకుండా.. కుమారుడు ఇజాన్‌ను పెంచడం, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి వ్యాయామం వంటివి చేస్తూ బిజీ కెరీర్‌ను సానియా నిర్వహిస్తోంది.
మైఖేల్‌తో ప్రత్యేక చాట్‌లో సానియా మీర్జా టెన్నిస్‌కు మించి తన జీవిత అంతరంగం గురించి పంచుకున్నారు. తల్లిగా, ఫిట్‌నెస్ ఔత్సాహికురాలిగా, వ్యపస్థాపకురాలిగా సానియా తన జీవితంలో రాణిస్తోంది. కొడుకు ఆలన పాలన చూసుకోవడం నుంచి జిమ్‌లో ప్రేరణ పొందడం వరకు ఆమె ప్రతి రోజూ బిజీగా ఉంటారు. కొడుకును పెంచడం, ఫిట్ నెస్, ఆటపై దృష్టి.. వీటన్నింటిని సానియా మీర్జా ఎలా నిర్వహిస్తారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

సానియా మీర్జా రోజు ఎలా గడుస్తుందని అడిగినప్పుడు.. సానియా సమాధానం ఆమె కుమారుడు ఇజాన్ చుట్టూ తిరుగుతుంది. ఆమె వృత్తిపరమైన జీవితంలో దుబాయ్ లో టెన్నిస్ కేంద్రాలను నడపడం లేదా పికిల్ బాల్ ఓపెన్ 2025తో అనుబంధం ముఖ్యమైనవి అయిప్పటికీ తల్లిగా పాత్ర ప్రధానమైనదని సానియా మీర్జా చెప్పింది. 2025లో పికిల్‌బాల్ ఓపెన్ దుబాయ్ లో మే 8 నుండి 11 వరకు నిర్వహించబడుతుంది, దీనికి సానియా మీర్జా టోర్నమెంట్ భాగస్వామిగా ఎంపికయ్యారు.
సానియా మీర్జా మాట్లాడుతూ.. " నా జీవితంలో ఒక రోజు నేను ఎక్కడ ఉన్నానో దానిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేను దుబాయ్ లో ఉన్నప్పుడు నా కొడుకు ఇజాన్‌తో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తాను."అని చెప్పుకొచ్చారు. సానియా మీర్జా ఉదయం 6.45-7 గంటల ప్రాంతంలో పాఠశాల పరుగుతో ప్రారంభమవుతుంది. ఇజాన్‍ను స్కూల్ కు పంపిన తర్వాత సానియా వ్యాయామం కోసం జిమ్ కు వెళ్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం తన కొడుకును ఇంటికి తీసుకెళ్లే ముందు తన ఆటకు సంబంధించిన పనులను చూసుకుంటానని సానియా మీర్జా వెల్లడించింది.
సానియా ఫిట్‌నెస్ రహస్యం
చాలా మంది అభిమానులు తరచుగా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే.. సానియా మీర్జా ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ఇంత ఫిట్‌గా ఎలా ఉంటారని అడుగుతూ ఉంటారు. దీనికి సానియా సమాధానం సూటిగా చెప్పారు. "నేను వారానికి ఐదుసార్లు జిమ్‌కు వెళ్తాను. నేను వారానికి ఆరుసార్లు కార్డియో చేస్తాను. ప్రతిసారీ రెండు గంటలు గడపడానికి ప్రయత్నిస్తాను." సానియా మీర్జా కార్డియో వ్యాయామాలతో పాటు అప్పుడప్పుడు పికిల్‌బాల్ ఆడుతుంది.
కొడుకు భవిష్యత్ గురించి సానియా ఏమన్నారంటే?
సానియా మీర్జా తన కుమారుడు ఇజాన్ భవిష్యత్ గురించి కూడా కొన్ని విషయాలను పంచుకుంది. ఇజాన్ తన తల్లిదండ్రుల లాగే క్రీడల్లో రాణిస్తాడని చాలా మంది భావిస్తారు. కానీ కొడుకు భవిష్యత్ కోసం సానియా తన భావాలను వ్యక్తం చేసింది. ఇజాన్ తన కెరీర్ లో ఏ మార్గాన్ని ఎంచుకున్నా మద్దతు ఇస్తానని సానియా చెప్పుకొచ్చారు. "ఇజాన్ తనకు ఇష్టమైనది చేయగలడు. తన కెరీర్ లో ఏమి చేయాలనుకున్నా.. అది టెన్నిస్ అయినా, క్రికెట్ అయినా, పికిల్‌బాల్ అయినా, లేదా ప్రస్తుతానికి ఏదైనా ఇతర క్రీడ అయినా.. ఇజాన్ ఫుట్‌బాల్ ఆడుతాడు అని నేను అనుకుంటున్నాను. క్రీడలు కాకుండా మరేదైనా రంగం ఎంచుకున్నా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను" అని సానియా చెప్పుకొచ్చింది.
సానియా మీర్జా నిజంగా సూపర్ ఉమెన్..
సానియా మీర్జా మాతృత్వం, ఫిట్ నెస్, ఆమె వృత్తిపరమైన జీవితాన్ని సమతుల్యతతో నిర్వహిస్తున్నారు. ఓ వైపు తల్లిగా, మరో వైపు క్రీడలను ప్రోత్సహిస్తూ సానియా సూపర్ ఉమెన్ గా దూసుకెళ్తున్నారు. తల్లిగా, అథ్లెట్ గా రాణిస్తున్న సానియా మీర్జా.. యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.