న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోసం: ఢిల్లీలో రష్యా టెన్నిస్ సుందరి షరపోవాపై కేసు

నిషేధాన్ని ముగించుకొని ఇటీవలే మళ్లీ రాకెట్ పట్టిన రష్యా టెన్నిస్‌ స్టార్ మరియా షరపోవాపై దేశ రాజధాని ఢిల్లీలో కేసు నమోదైంది.

By Nageshwara Rao

హైదరాబాద్: నిషేధాన్ని ముగించుకొని ఇటీవలే మళ్లీ రాకెట్ పట్టిన రష్యా టెన్నిస్‌ స్టార్ మరియా షరపోవాపై దేశ రాజధాని ఢిల్లీలో కేసు నమోదైంది. మారియా షరపోవా ప్రచారకర్తగా వ్యవహరించిన ఓ గృహ నిర్మాణ సంస్థ తనను మోసం చేసిందంటూ భావన అగర్వాల్‌ అనే మహిళ కోర్టుని ఆశ్రయించింది.

గుర్‌గావ్‌లోని విలాసగృహ సముదాయ ప్రాజెక్టు నిర్మిస్తున్న హోమ్‌స్టెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కంపెనీకి షరపోవా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. అయితే, ఈ కంపెనీ టెన్నిస్‌ అకాడమీ, దుస్తులు, క్రీడా ఉపకరణాల దుకాణం పెట్టుకునేలా ప్లాట్ల నిర్మాణం పూర్తిచేసి ఇస్తామని ఆశ చూపించి పెట్టుబడులు పెట్టించింది.

FIR registered against Maria Sharapova in Gurugram for endorsing shady realty project

ఇందుకోసం గాను 2013లో తమ నుంచి రూ. 53 లక్షలు తీసుకుందనీ.. కానీ ఇప్పటివరకు ఆ కంపెనీ హామీ నిలబెట్టుకోలేకపోయిందని ఢిల్లీకి చెందిన భావనా అగర్వాల్ అనే వ్యక్తి నార్త్‌వెస్ట్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాలుగేళ్లు గడిచినా ప్రతిపాదిత స్థలంలో ఎలాంటి నిర్మాణాలు ప్రారంభం కాలేదని ఆ పిటిషన్‌లో ఆమె కోర్టుకు తెలిపారు.

దీంతో ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు సంస్థ డైరెక్టర్లతో పాటు ప్రచారకర్తగా వ్యవహరించిన షరపోవా మీద కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X