చేయి పెట్టినప్పుడే తెలిసింది.. ప్యాంటు తప్పుగా వేసుకున్నా: ఫెదరర్ (వీడియో)

హైదరాబాద్: రోజర్ ఫెదరర్ టెన్నిస్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఈ మాజీ వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ తన కెరీర్‌లో చేసుకున్న అత్యంత సరదా సన్నివేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఫెదరర్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ టోర్నీలో ఆడుతోన్న సంగతి తెలిసిందే.
వింబుల్డన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ "నా టెన్నిస్ కెరీర్‌లో అత్యంత సరదా సన్నివేశం 2007 వింబుల్డన్‌లోనే చోటు చేసుకుంది. ఫైనల్లో రఫెల్ నాదల్‌తో తలపడ్డాను. ఐదు సెట్ల హోరా హోరీ మ్యాచ్‌లో నాదల్‌ను ఓడించి టైటిల్ గెలుచుకున్నాను. అనంతరం నిర్వాహకులు అవార్డు ప్రదాన కార్యక్రమం చేపట్టారు" అని అన్నాడు.

నేను కాస్త ఆందోళనతో ఉన్నా
"ఆ సమయంలో నేను కాస్త ఆందోళనతో ఉన్నా. ఆ టోర్నీ కోసం నేను ప్రత్యేకంగా ట్రౌజర్ కుట్టించుకున్నాను. దాన్ని ధరించి ట్రోఫీ అందుకోవాలనుకున్నా. అనుకున్నట్టే ప్యాంటు ధరించాను. కానీ, నేను ప్యాంటు తప్పుగా ధరించాను. ముందుది వెనుక... వెనుకది ముందు వచ్చేలా వేసుకున్నాను. ఆ విషయాన్ని వెంటనే గమనించలేకపోయా" అని చెప్పాడు.
ట్రోఫీ అందుకోవడానికి నన్ను పిలిచారు
"వింబుల్డన్ ట్రోఫీ అందుకోవడానికి నన్ను పిలిచారు. ట్రోఫీ అందుకున్నాక జేబులో చేయి పెడదామని ప్రయత్నించా. అప్పుడే తెలిసింది. ప్యాంటు తప్పుగా వేసుకున్నానని. ఇప్పటి వరకు నా కెరీర్‌లో టెన్నిస్‌కు సంబంధించి చోటు చేసుకున్న అత్యంత సరదా సన్నివేశం ఇదే" అని ఫెదరర్ వివరించాడు.

తొలి రౌండ్‌లో లజోవిక్‌పై ఫెదరర్ విజయం
టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఫెదరర్ 6-1, 6-3, 6-3 తేడాతో సెర్బియా క్రీడాకారుడు దూసన్ లజోవిక్‌పై విజయం సాధించాడు. కేవలం 79 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ 2 ముందు లజోవిక్ నిలవలేకపోయాడు.

తొమ్మిదో సారి వింబుల్డన్ టైటిల్ సాధించే లక్ష్యంతో
ఇప్పటివరకు ఫెదరర్ ఖాతాలో ఎనిమిది వింబుల్డన్ టైటిళ్లు ఉన్నాయి. తొమ్మిదో సారి వింబుల్డన్ టైటిల్ సాధించే లక్ష్యంతో బరిలోకి దిగాడు. అంతేకాదు టైటిల్ ఫేవరెట్లలో ఫెదరర్ ఒకడు. వింబుల్డన్ టైటిల్ గెలిచి తిరిగి నంబర్‌వన్ ర్యాంకు దక్కించుకోవాలని ఫెదరర్ ఉవ్విళ్లూరుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications