For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫెదరర్ ముంగిట మరో మైలురాయి

 Federer wins 99th title, beats Copil in Swiss Indoors final

హైదరాబాద్: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కెరీర్‌లో మరో మైలురాయికు ముందున్నాడు. స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ తన కెరీర్‌లో 99వ సింగిల్స్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఎన్నో అసమాన్య రికార్డులను, టైటిళ్లను సొంతం చేసుకున్న స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్.. మరోమారు తళుక్కుమన్నాడు. వయసు పెరుగుతున్నా.. వన్నె తగ్గని ఆటతీరుతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఫెదరర్.. సొంతగడ్డపై చిరస్మరణీయ విజయాన్నందుకున్నాడు.

తన సుదీర్ఘ కెరీర్‌లో 99వ ఏటీపీ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం ముగిసిన స్విస్‌ ఓపెన్‌ టోర్నీలో అతను తొమ్మిదోసారి విజేతగా నిలిచాడు. ఫైనల్లో ఈ స్విస్ స్టార్ 7-6(5), 6-4 తేడాతో క్వాలిఫయర్ మారియర్ కోపిల్‌పై అలవోక విజయం సాధించాడు. దీని ద్వారా తన సొంత ఇలాఖా బాసెల్‌లో తొమ్మిదో టైటిల్‌ను ముద్దాడాడు.

దీని ద్వారా హలె గ్రాస్ కోర్టు (9 టైటిళ్లు) రికార్డును సమం చేశాడు. 99వ ఏటీపీ టైటిల్ ద్వారా ఆల్‌టైమ్ గ్రేట్ జిమ్మీ కానర్స్ (109 టైటిళ్లు)కు రోజర్ మరింత చేరువయ్యాడు. ఒకప్పుడు సెయింట్ జాకోబలె స్టేడియంలో బాల్ బాయ్‌గా పనిచేసిన ఫెదరర్.. ఈనాడు రికార్డు టైటిల్‌ను సగర్వంగా అందుకున్నాడు.

గతంలో ఫెడరర్‌ 2006, 07, 08, 10, 11, 14, 15, 2017లలో ఈ టోర్నీని గెలిచాడు. చాంపియన్‌ ఫెడరర్‌కు 4,27,765 యూరోలు (రూ. 3 కోట్ల 56 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఫెడరర్‌ మరో టైటిల్‌ గెలిస్తే... జిమ్మీ కానర్స్‌ (109 టైటిల్స్‌-అమెరికా) తర్వాత 100 టైటిల్స్‌ నెగ్గిన రెండో ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు.

Story first published: Monday, October 29, 2018, 9:07 [IST]
Other articles published on Oct 29, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+