For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫెదరర్‌కు సోంగా షాక్, వింబుల్డన్‌లో సంచలనం

By Pratap
Jo-Wilfried Tsonga
లండన్‌: రోజర్ ఫెదరర్ ఆశలు వమ్మయ్యాయి. నాదల్ గాయం కారణంగా, తన ఫామ్ వల్ల వింబుల్డన్ టైటిల్ తనకు వశమవుతుందని భావించిన ఫెదరర్ ఆశలపై సోంగా నీళ్లు చల్లాడు. ఎవరూ వూహించని విధంగా ఫ్రెంచ్‌ వీరుడు సోంగా రూపంలో ఫెదరర్‌కు ప్రమాదం ఎదురైంది. భారీ సర్వీసులు, వాలీలతో విరుచుకుపపడ్డ ఈ టెన్నిస్‌ అలీ ధాటికి వింబుల్డన్‌ చరిత్రలోనే అతి పెద్ద సంచలనం నమోదైంది. తొలి రెండు సెట్లూ గెలిచిన తర్వాత ఒక్క గ్రాండ్‌స్లామ్‌లోనూ ఓటమెరుగని ఘనత స్విస్‌ అందగాడు రోజర్‌ ఫెదరర్‌ది. వింబుల్డన్‌లో ఏనాడూ క్వార్టర్స్‌ దాటని చరిత్ర సోంగాది. అందుకే ఈ మ్యాచ్‌లో ఫెడెక్స్‌ గెలుపుపై ఎవరికీ పెద్దగా సందేహాల్లేవు‌. అయితే భారీ సర్వీసులతోచెలరేగిన సోంగా 3-6, 6-7(3), 6-4, 6-4, 6-4తో అద్భుత విజయం సాధించాడు.

తొలిసెట్లో ఒక్క అనవసర తప్పిదానికీ తావివ్వని ఫెదరర్‌ 4 ఏస్‌లు, 12 విన్నర్లు సంధించి అవలీలగా విజయం సాధించాడు. రెండో సెట్లో సోంగా భారీ సర్వీసులను క్రమపద్ధతిలో సంధించాడు. దీంతో సెట్‌ టైబ్రేకర్‌కు వెళ్లింది. ఫెదరర్‌ ఆరంభంలోనే 5-0 ఆధిక్యం సాధించి 7-3తో సెట్‌ను దక్కించుకున్నాడు. ఐతే మూడో సెట్‌ ఆరంభంలోనే బ్రేక్‌ సాధించిన సోంగా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నెట్‌గేమ్‌తో దూకుడు పెంచి ఒత్తిడి పెంచాడు. వ్యాలీలతో కదం తొక్కి మూడో సెట్‌ దక్కించుకున్నాడు. నిజానికి అప్పటికీ ఆధిక్యం ఫెదరర్‌దే. ఫెదరర్‌ 108 పాయింట్లు సాధిస్తే సోంగా 81 స్కోరు చేశాడు. ఫెడెక్స్‌ ఏస్‌లు 12 ఐతే సోంగావి 9. అనవసర తప్పిదాల్లోనూ సోంగా (18)తో పోలిస్తే ఫెదరర్‌వే (7) తక్కువ. కానీ అసహనం ఫెదరర్‌ జోరును తగ్గించింది. చివరి రెండు సెట్లలో సోంగాను అడ్డుకోడానికి ఫెడెక్స్‌ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

మరో క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా సంచలనం చోటు చేసుకుంది. 18 ఏళ్ల టామిక్‌ జోరుకు రెండోసీడ్‌ జకోవిచ్‌ బ్రేకులు వేశాడు. 6-2, 3-6, 6-3, 7-5తో కాస్త శ్రమించి సెమీస్‌ చేరుకున్నాడు. పవర్‌ సర్వీసులతో టామిక్‌ను నిరంతరం ఒత్తిడికి గురిచేసిన జకోవిచ్‌ మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆండీ ముర్రే (బ్రిటన్‌) వరుస సెట్లలో 6-3, 6-4, 6-4తో ఫెలిసియానో లోపెజ్‌ (స్పెయిన్‌) చిత్తుచేస్తే, టాప్‌సీడ్‌ నాదల్‌ 6-3, 6-3, 5-7, 6-4తో మార్డీ ఫిష్‌ (అమెరికా)ను అధిగమించాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+