ఫెదరర్, షరపోవా నిష్క్రమణతో కళ తప్పిన యుఎస్ ఓపెన్

హైదరాబాద్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్‌లో వరుస సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన స్టార్స్ ప్లేయర్లు ఒక్కొక్కరు టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నారు. తాజాగా స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, రష్యన్ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఈ జాబితాలో చేరారు.
పురుషుల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన రోజర్ ఫెదరర్, మహిళల సింగిల్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మరియా షరపోవా ప్రీ క్వార్టర్స్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు. వీరి నిష్క్రమణతో యుఎస్ ఓపెన్ టోర్నీ కళ తప్పింది. పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో ఆస్ట్రేలియన్ అన్‌సీడెడ్ ప్లేయర్ జాన్ మిల్మన్ 2వ సీడ్‌గా బరిలోకి దిగిన రోజర్ ఫెదరర్‌పై విజయం సాధించాడు.
టెన్నిస్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన జాన్ మిల్మన్
ఐదు సార్లు యుఎస్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచిన రోజర్ ఫెదరర్‌పై జాన్ మిల్మన్ నాలుగు సెట్లలో పోరాడి నెగ్గి టెన్నిస్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరచాడు. ఇద్దరి మధ్యా హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను 6-3తో ఫెదరర్ సొంతం చేసుకోవడంతో క్వార్టర్‌ఫైనల్ రౌండ్ చేరడం ఖాయమనుకున్నారు టెన్నిస్ అభిమాులు.
అనూహ్యంగా పుంజుకున్న మిల్మన్
అయితే, రెండో సెట్‌లో అనూహ్యంగా పుంజుకున్న మిల్మన్ ఎదురుదాడికి దిగి వరుసగా మూడు సెట్లలో 3-6, 7-5, 7-6, 7-6 తేడాతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక, మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో స్పానిష్ వెటరన్ కార్లా సారెజ్ నవారో టోర్నీలో 22వ సీడ్‌గా బరిలోకి దిగిన మరియా షరపోవాపై అలవోకగా విజయం సాధించింది.
ఫ్రీ క్వార్టర్స్‌లో షరపోవా ఓటమి
మహిళల సింగిల్స్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా పోటీకి దిగిన స్పెయిన్ వెటరన్ కార్లా సారెజ్ జోరు మీదున్న 22వ సీడ్ షరపోవాపై 6-4,6-3తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఏడాది పాటు నిషేధం తర్వాత తిరిగి పూర్తి స్థాయిలో విజృంభిస్తున్న షరపోవా మరోసారి అమెరికన్ ఓపెన్ టైటిల్ సాధించలేకపోయినా.. కనీసం ఫైనల్ చేరుతుందని భావించారు.
అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన కార్లా సారెజ్
కానీ, కార్లా సారెజ్ మాత్రం షరపోవాను ప్రీ క్వార్టర్స్‌లోనే ఓడించి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. ప్రస్తుతం జరుగుతున్న యుఎస్ ఓపెన్ బరిలోకి దిగిన స్టార్ ప్లేయర్లు అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్, ముర్రే, వావ్రింకా కాగా, మహిళల సింగిల్స్‌లో హాలెప్, ముగురుజా, క్విటోవా, వీనస్ విలియమ్స్‌లు ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications