అరుదైన రికార్డు చేరువలో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్

హైదరాబాద్: స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన కెరీర్‌లో మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. 100వ ఏటీపీ సింగిల్స్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు ఫెదరర్ మరో రెండు అడుగుల దూరంలో నిలిచాడు. దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ టోర్నీలో ఫెదరర్ క్వార్టర్స్‌లో మార్టన్‌పై గెలుపొంది సెమీస్‌లోకి ప్రవేశించాడు.
ఇప్పటికే దుబాయి టోర్నీని ఏడు సార్లు గెలిచిన రోజర్ ఫెదరర్ క్వార్టర్స్‌లో హంగేరి ప్లేయర్ మార్టన్‌ను 7-6, 6-4 తేడాతో ఓడించాడు. ప్రస్తుతం ఫెదరర్ ఖాతాలో 99 ఏటీపీ సింగిల్స్ టైటిళ్లు ఉన్నాయి. నాలుగు నెలల క్రితమే 99వ టైటిల్‌ను గెలుచుకున్న ఫెదరర్‌కు 100వ టైటిల్‌ను నెగ్గేందుకు ఇది నాలుగో అవకాశం.
ఈ టోర్నీలో మరోసారి గెలిస్తే, 100 ఏటీపీ టైటిళ్లు గెలిచిన రెండో ప్లేయర్‌గా ఫెదరర్ చరిత్ర సృష్టిస్తాడు. అమెరికా మాజీ ప్లేయర్ జిమ్మీ కానర్స్ ఖాతాలో 109 టైటిల్స్ ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications