Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యుఎస్ ఓపెన్: అతి కష్టం మీద ఫెదరర్ శుభారంభం

హైదరాబాద్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్‌ తొలి రౌండ్‌లో స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ అతి కష్టం మీద నెగ్గాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన ఫ్రాన్సిస్ టైఫోపై 4-6, 6-2, 6-1, 1-6, 6-4 స్కోర్‌తో ఫెద‌ర‌ర్ విజ‌యం సాధించాడు.

2003 తర్వాత తొలి రౌండ్‌లో ఫెదరర్ మొదటి సెట్‌ను కోల్పోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో ఐదు సార్లు యుఎస్ ఓపెన్ గెలిచిన ఫెదరర్ ఆర్ద‌ర్ ఆషే స్టేడియంలో జరిగిన తొలి రౌండ్‌లో నెగ్గేందుకు చాలా కష్టపడ్డాడు. ఐదు సెట్ల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఫెదరర్ చివ‌ర్లో చెల‌రేగి ఆడాడు.

Federer plays down back worries after US Open battle

దీంతో ఫ్రాన్సిస్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. మొదటి సెట్‌లో చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. సెట్ ఆరంభంలోనే పొర‌పాట్లు చేసిన ఫెదరర్ ఆ తర్వాత వాటిని సరిదిద్దుకున్నాడు. నాలుగ‌వ సెట్‌లో మ్యాచ్ పాయింట్‌ను చేజార్చుకున్న ఫెదరర్ ఐదో సెట్‌ వరకు ఆడాల్సి వ‌చ్చింది.

దీంతో నిర్ణయాత్మక ఐదో సెట్‌లో ఫెద‌ర‌ర్ త‌న అనుభ‌వాన్ని అంత ఉప‌యోగించి అమెరికా టీనేజ‌ర్‌ను ఓడించాడు. తొలి రౌండ్ విజయానంతరం ఫెదరర్ మాట్లాడుతూ కోర్టు నుంచి బయటికి వచ్చేటప్పుడు చాలా సంతోషంగా ఉందని అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+