న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫెదరర్‌కు ఫైనల్ వెళ్లడం ఇది ఏడోసారి

హైదరాబాద్: ఫెదరర్‌ మళ్లీ వచ్చేశాడు. గతేడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో విజేతగా నిలిచి పూర్వ వైభవాన్ని సంతరించుకున్న రోజర్‌.. మరోసారి ఇదే వేదికలో టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యాడు. దక్షిణ కొరియా యువ సంచలనం హుయాన్‌ చంగ్‌ గాయం కారణంగా సెమీస్‌ నుంచి తప్పుకోవడంతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రోజర్‌.. పెద్దగా కష్టపడకుండానే ఫైనల్‌ చేరాడు.

గాయంతో పోటీ నుంచి తప్పుకుని:

గాయంతో పోటీ నుంచి తప్పుకుని:

తుది పోరుకు అర్హత సాధించడం స్విస్‌ మాస్టర్‌కు ఇది ఏడోసారి. ఆదివారమే మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)తో టైటిల్‌ సమరం. శుక్రవారం పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో రోజర్‌ 6-1, 5-2తో చంగ్‌పై ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయంతో పోటీ నుంచి తప్పుకున్నాడు. ‘‘ఈ టోర్నీలో చంగ్‌ అద్భుతంగా ఆడాడు. చివరి వరకు అతను పోరాడేతత్వం ఎంతో నచ్చింది. ఈ దశకు రావడంతోనే చంగ్‌ తానో గొప్ప ఆటగాడని నిరూపించుకున్నాడు. ఛాంపియన్‌ అయ్యే అన్ని లక్షణాలు అతనిలో ఉన్నాయి. అతను త్వరలోనే టాప్‌-10 ఆటగాడు అవుతాడు'' అని ఫెదరర్‌ అన్నాడు.

 రోహన్‌ బోపన్నతో కలిసి:

రోహన్‌ బోపన్నతో కలిసి:

రోహన్‌ బోపన్నతో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఫైనల్‌ చేరిన హంగేరి అమ్మాయి బబోస్‌.. మహిళల డబుల్స్‌లో మ్లదనోవిచ్‌ (ఫ్రాన్స్‌)తో కలిసి టైటిల్‌ కొట్టింది. ఫైనల్లో ఐదోసీడ్‌ బబోస్‌-మ్లదనోవిచ్‌ 6-4, 6-3తో రెండో సీడ్‌ మకరోవా-వెస్నీనా (రష్యా)ను వరుస సెట్లలో ఓడించారు.

అతనికదే తొలి టైటిల్‌:

అతనికదే తొలి టైటిల్‌:

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ బోపన్న జోడీ ఫైనల్లో ప్రవేశించింది. సెమీఫైనల్లో ఐదో సీడ్‌ బోపన్న-తిమియా బబోస్‌ (హంగేరి) 7-5, 5-7 (10-6)తో మార్టినెజ్‌ సాంజెస్‌ (స్పెయిన్‌)-డిమోలినర్‌ (బ్రెజిల్‌)ను ఓడించారు. టైటిల్‌ సమరంలో బోపన్న జోడీ.. దబ్రౌస్కీ (కెనడా)-పవిచ్‌ (క్రొయేషియా)తో తలపడనుంది. ఇప్పుడు ప్రత్యర్థిగా ఉన్న దబ్రౌస్కీతో కలిసే 2017 ఫ్రెంచ్‌ ఓపెన్లో బోపన్న మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ కొట్టాడు. కెరీర్‌లో అతనికదే తొలి టైటిల్‌.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, January 27, 2018, 20:09 [IST]
Other articles published on Jan 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X