Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫెదరర్ క్వార్టర్స్ ఫైనల్‌కు.. సెమీస్‌కు చేరుకున్న సిమోనా హలెప్

Federer, Del Potro move into Indian Wells quarters

హైదరాబాద్: స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ ఫెడరర్‌ 7-5, 6-4తో జెరెమీ చార్డీ (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. 36 ఏళ్ల ఫెదరర్‌కు ఈ ఏడాది వరుసగా 15వ విజయం కావడం విశేషం.

2006 తర్వాత ఓ సీజన్‌లో ఫెదరర్‌ వరుసగా 15 విజయాలు సాధించడం ఇదే తొలిసారి. 2006లో ఫెదరర్‌ వరుసగా 16 మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. క్వార్టర్‌ ఫైనల్లో 30వ సీడ్‌ హైయాన్‌ చుంగ్‌ (దక్షిణ కొరియా)తో ఫెదరర్‌ ఆడనున్నాడు. ప్రపంచ 100వ ర్యాంకర్‌ జెరెమీ చార్డీతో 82 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఫెదరర్‌ వరుస సెట్‌లలో ఒక్కోసారి సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు.

కేవలం రెండు ఏస్‌లు సంధించిన అతను ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ కూడా చేయలేదు. ఫెదరర్‌ చేసిన 25 తొలి సర్వీస్‌లలో పాయింట్లు పొందడం విశేషం. 'సీజన్‌ గొప్పగా సాగుతోంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో, రోటర్‌డామ్‌ ఓపెన్‌లో టైటిల్స్‌ గెలిచాను. ఈ టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో నెగ్గాను. అంతా సాఫీగా సాగిపోతున్నందుకు ఆనందంగా ఉన్నాను' అని రికార్డుస్థాయిలో ఆరోసారి ఈ టైటిల్‌పై గురి పెట్టిన ఫెడరర్‌ వ్యాఖ్యానించాడు.

సెమీస్‌కు చేరుకున్న సీమోనా హలెప్:
ప్రపంచ నంబర్‌వన్ సీమోనా హలెప్ ఇండియన్‌ వెల్స్ టెన్నిస్ టోర్నీ సెమీస్ చేరింది. క్రొయేషియా అమ్మాయి పెట్రా మాట్రిక్‌తో గురువారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 6-4,6-7(5/7),6-3 స్కోరుతో విజ యం సాధించింది. హలెప్‌ సెమీస్‌లో ఒసాకతో తలపడనుంది. మరో క్వార్టర్స్‌లో నవోమి ఒసాక (జపాన్‌) 6-2, 6-3తో ఐదో సీడ్‌ కరోలినా ఫ్లిస్కోవాపై గెలిచింది. దీంతో సెమీస్‌కు చేరుకుంది.

Story first published: Friday, March 16, 2018, 11:16 [IST]
Other articles published on Mar 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+