సానియాకు ఘనస్వాగతం: 9ఏళ్ల తర్వాత సొంతగడ్డపై(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రపంచ టెన్నిస్ డబుల్స్‌లో నంబర్‌వన్ ర్యాంకర్‌గా నిలిచిన టెన్నిస్ క్వీన్ సానియా మీర్జాకు మంగళవారం హైదరాబాద్‌లో ఘనస్వాగతం లభించింది. స్విట్జర్లాండ్ క్రీడాకారిణి మార్టినా హింగిస్‌తో కలిసి ఫ్యామిలీ సర్కిల్ కప్‌లో డబుల్స్ చాంపియన్‌గా నిలిచి ప్రపంచ నంబర్‌వన్ హోదాను అందుకున్న సానియా, అమెరికా నుంచి మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన సానియాకు ఆమె కుటుంబసభ్యులు, అభిమానులు గులాబీ పూలు, బొకేలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో సానియా మీడియాతో మాట్లాడుతూ.. తనను ఇంతలా ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. తనను ప్రోత్సహిస్తున్న అభిమానులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నానని సానియా పేర్కొంది.
బ్రాండ్ అంబాసిడర్‌గా హైదరాబాద్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నందుకు ఆనందంగా ఉందని సానియా చెప్పింది. కాగా, సానియా ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే ఒక్కసారిగా అందరూ ఎగబడడంతో కాసేపు తోపులాట జరిగింది.
9ఏళ్ల తర్వాత సొంతగడ్డపై
ఇది ఇలా ఉండగా దాదాపు 9ఏళ్ల తర్వాత సానియా మీర్జా సొంతగడ్డ(హైదరాబాద్)పై ఆడనుంది. నగరంలో మంగళవారం ప్రారంభమైన ఫెడ్ కప్‌లో భాగంగా భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న సానియా మీర్జా, సెంట్రల్ కోర్టులో బుధవారం సాయంత్రం 4.30గంటలకు జరిగే మ్యాచులో ఆడనుంది. సానియా మీర్జా సారథ్యం వహిస్తున్న భారత జట్టులో అంకితా రైనా, ప్రార్థన తోంబరె, నటషా పల్హా సభ్యులుగా ఉన్నారు.

ఘనస్వాగతం
ప్రపంచ టెన్నిస్ డబుల్స్‌లో నంబర్‌వన్ ర్యాంకర్‌గా నిలిచిన టెన్నిస్ క్వీన్ సానియా మీర్జాకు మంగళవారం హైదరాబాద్‌లో ఘనస్వాగతం లభించింది.

ఘనస్వాగతం
స్విట్జర్లాండ్ క్రీడాకారిణి మార్టినా హింగిస్‌తో కలిసి ఫ్యామిలీ సర్కిల్ కప్‌లో డబుల్స్ చాంపియన్‌గా నిలిచి ప్రపంచ నంబర్‌వన్ హోదాను అందుకున్న సానియా, అమెరికా నుంచి మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది.

ఘనస్వాగతం
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన సానియాకు ఆమె కుటుంబసభ్యులు, అభిమానులు గులాబీ పూలు, బొకేలతో ఘనంగా స్వాగతం పలికారు.

ఘనస్వాగతం
ఈ సందర్భంగా మీడియాతో సానియా మీడియాతో మాట్లాడుతూ.. తనను ఇంతలా ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications