
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో 11సార్లు చాంపియన్, స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్‌కు షాక్ తగిలింది. మొనాకో వేదికగా శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ 6-4, 6-2తో ఇటలీకి చెందిన ప్రపంచ 18వ ర్యాంకర్ ఫాబియో ఫాగ్ చేతిలో ఓటమిని ఎదుర్కొన్నాడు.
తాజా విజయంతో క్లే కోర్టులపై నాదల్‌ను మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఓడించిన నాలుగో ప్లేయర్‌గా ఫాబియో ఫాగ్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకుముందు జొకోవిచ్ (సెర్బియా), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), గాస్టన్ గాడియో (అర్జెంటీనా) మాత్రమే ఈ ఘనత సాధించారు.
'రాఫెల్ నాదల్‌తో మ్యాచ్ ఆడడం ఎప్పుడూ కష్టమే. విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. నేను నీతో మ్యాచ్ ఆడుతాను అని నాదల్‌తో ముందు రోజే చెప్పాను. అతనితో ఆడినప్పుడు కొన్ని మ్యాచ్‌లలో గెలిచాను. అందులో యూఎస్ ఓపెన్లో గెలిచిన మ్యాచ్ చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇక నేను కోల్పోవటానికి ఏమీ లేదు. ఎందుకంటే క్లే కోర్టులపై నాదల్‌ను ఎదుర్కోవడం ఎప్పుడూ కష్టమే' అని ఫాబియో తెలిపారు.