Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందాల ఆరబోత: స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీలో (ఫోటో వైరల్)

Eugenie Bouchard shows off behind in Instagram snap but is labelled ‘desperate’ by fans

హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు ఎజినీ బౌచర్డ్. కెనడాకు చెందిన ఈ టెన్నిస్ భామ తన అందంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. కెరీర్‌లో ఇప్పటిదాకా ఒకే ఒక డబ్ల్యూటీఏ టైటిల్‌ నెగ్గిన ఈ 24 ఏళ్ల సుందరి ఆటలో మెరిసింది తక్కువైనా.. అందంతో ఆకట్టుకున్నదే ఎక్కువ.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బౌచర్డ్ తాజాగా తన అందాల ఆరబోతను శృతిమించింది. స్విమ్మింగ్ పూల్‌ వద్ద బికినీలో ఉన్న ఫోటోని పోస్టు చేసింది. దీంతో "ఆడేదేమీ లేకున్నా.. వేషాలకేం కొదవలేదు" అంటూ టెన్నిస్‌ అభిమానులు వ్యంగ్యాస్ర్తాలు విసురుతున్నారు.

అంతేకాదు 'కాస్త గ్లామర్‌ డోస్‌ తగ్గించి.. రాకెట్‌పై దృష్టి సారిస్తే ఆటలో అంతోఇంతో గుర్తింపు తెచ్చుకుంటావు.. లేదంటే 'మరో అనా కౌర్నికోవా'లాగా మిగిలిపోతావ్‌' అంటూ ఫోటో కింద కామెంట్లు పెడుతున్నారు. నాలుగేళ్ల క్రితం కెరీర్‌లోనే అత్యుత్తమంగా సింగిల్స్‌లో వరల్డ్ 5వ ర్యాంకును అందుకున్న బౌచర్డ్‌ ప్రస్తుతం 123వ ర్యాంకులో కొనసాగుతోంది.

Story first published: Sunday, July 29, 2018, 17:10 [IST]
Other articles published on Jul 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+