Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ట్విటర్‌లో సూచనలు అడిగి కంగుతిన్న టెన్నిస్‌ భామ 'బౌచర్డ్‌'

Eugenie Bouchard Asks For Suggestions On Twitter To Order Pizza, Gets Bizarre Replies

కెనడా: కోర్టులోనే కాకుండా ట్విటర్‌లో అత్యంత చురుగ్గా ఉండే మహిళా టెన్నిస్ క్రీడాకారులలో కెనడా ప్లేయర్‌ యూజిని బౌచర్డ్‌ ఒకరు. 25 ఏళ్ల బౌచర్డ్‌ ఆట పరంగా కాకుండా తన అందంతోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. ఆట, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు ట్విటర్‌లో ఉంచడంతో బౌచర్డ్‌కు సోషల్ మీడియాలో తెగ ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఈ అమ్మడు ఏ పోస్ట్ చేసినా.. అది కొద్ది నిమిషాల్లోనే వైరల్ అవుద్ది.

యూజిని బౌచర్డ్‌ చేసే పోస్ట్‌లకు అభిమానులు క్షణాల్లోనే రియాక్ట్‌ అవుతుంటారు. అయితే అభిమానుల రియాక్షన్‌తో కొన్నిసార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. ఇంతకుముందు ఎదో సరదాగా చేసిన ఓ ట్వీట్‌.. అనామక వ్యక్తితో డేట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి కూడా తెచ్చింది. అయితే బౌచర్డ్‌ ఇచ్చిన మాట ప్రకారం ఆ వ్యక్తితో డేట్‌కు వెళ్లింది. దీంతో ఈ భామ హాట్‌టాపిక్‌గా మారింది. ఇలా కంగుతిన్నా.. బౌచర్డ్‌ మాత్రం సోషల్ మీడియాలో పోస్టులను మాత్రం ఆపడం లేదు.

తాజాగా మరో ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. 'ఆర్డర్‌ చేయడానికి మంచి పిజ్జా ఏంటి?' అని బౌచర్డ్‌ పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి భారీగానే స్పందన వచ్చింది. అయితే కొందరు మంచి పిజ్జాలను సూచించారు. బౌచర్డ్‌ వాటికి లైక్‌లు కూడా కొట్టింది. మరి కొందరు మాత్రం మండిపడ్డారు. 'పిజ్జాలు పక్కకు పెట్టి.. ఆటపై దృష్టి పెట్టు' అని ఓ నెటిజన్ కామెంట్‌ చేయగా.. 'ముందుగా ఒక్క టోర్నీనైనా గెలిచి చూపించు' అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు. 'టోర్నీ గెలిచి ఎంతకాలమైందో తెలుసా?' అని ఓ అభిమాని ట్వీట్ చేసాడు. దీంతో బౌచర్డ్‌ ఒక్కసారిగా అవాక్కయింది.

బౌచర్డ్‌ 2012లో జూనియర్‌ వింబుల్డన్‌ చాంపియన్‌గా అవతరించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. 2014లో డబ్ల్యూటీఏ టోర్నీ గెలిచి మరో సంచలనం సృష్టించింది. అదే ఏడాది యూఎస్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌కు చేరి ఎన్నో ఆశలు రేపింది. అనంతరం సరైన రీతిలో ఆడలేక వెనకబడింది. అయితే ప్రతీ టోర్నీలో ఏదో ఒక స్టార్‌ క్రీడాకారిణిని ఓడించి వార్తల్లో నిలుస్తుంది. గతేడాది మాడ్రిడ్ ఓపెన్‌లో రష్యా అందం మరియా షరపోవాను ఓడించింది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క టోర్నీలో కూడా ఆమె మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఇకనైనా గాడిలో పడుతుందేమో చూడాలి.

Story first published: Friday, September 27, 2019, 17:30 [IST]
Other articles published on Sep 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+