
వింబుల్డన్ - 2022లో తొలిసారి సింగిల్స్ వుమెన్స్ టైటిల్‌ను కజకిస్థాన్‌కు చెందిన 23ఏళ్ల ఎలెనా రైబాకినా అందుకుంది. ఇక గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన తొలి కజకిస్థాన్ దేశస్తురాలిగా కూడా ఆమె రికార్డు నెలకొల్పింది. ఇక ట్యూనీషియాకు చెందిన ఓన్స్ జబీర్‌ను మహిళల సింగిల్స్ ఫైనల్‌లో 3-6, 6-2, 6-2 పాయింట్ల తేడాతో ఎలెనా రైబాకినా ఓడించింది. ఇకపోతే జబీర్ సైతం తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన మొదటి అరబ్ మహిళగా, వింబుల్డన్ ఫైనల్ చేరిన తొలి ఆఫ్రికన్ వుమెన్స్ ప్లేయర్‌గా నిలిచింది. తొలి సెట్ గెలిచిన తర్వాత జబీర్ పూర్తిగా తడబడింది. రైబాకినా మొదటి సెట్‌లో ఓడిపోయినా చివరి రెండు సెట్లలో తన సత్తా చాటింది.
ఇక ఈ మ్యాచ్ గెలిచిన అనంతరం ఎలెనా రైబాకినా మాట్లాడుతూ..'నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మ్యాచ్ సమయంలో నేను చాలా భయపడ్డాను. ఇక ఫైనల్లో గెలిచినందుకు అంతులేని సంతోషంగా ఉంది. ఇంతకు ముందెన్నడూ లేని అనుభూతిని పొందుతున్నాను.' అని రైబాకినా పేర్కొంది. అలాగే మరో ఫైనలిస్టు అయిన 27ఏళ్ల జబీర్‌ను కూడా ప్రశంసించింది. హై-క్లాస్ టెన్నిస్ ఆట ఆడిన ఆఫ్రికా ప్లేయర్లకు ఎంతో స్ఫూర్దిదాయకంగా నిలిచిందంటూ కొనియాడింది. ఇక సెమీస్లో మాజీ వింబుల్డన్ ఛాంపియన్ అయిన సిమోనా హాలెప్‌ను ఎలెనా ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక అంతకుముందు రెండు మూడు సార్లు ఫైనలిస్టు అయిన జబీర్ చేతిలో ఆమె ఓడిపోవడంతో మ్యాచ్‌కు ముందు చాలా నెర్వస్‌గా ఫీలయింది. కానీ మ్యాచ్‌లో ఆమె మంచి మూమెంటమ్ అందుకుంది.