న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో ఫ్యాషన్ వీక్ టెన్సిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. న్యూయార్క్ స్ప్రింగ్ సమ్మర్ 2016 పేరుతో నిర్వహించే ఈ ఫ్యాషన్ వీక్‌లో పలువురు డిజైనర్లు రూపొందించిన దుస్తులు మోడళ్లు ధరించి ర్యాంప్‌పై హొయలొలికించారు.
ఈ కార్యక్రమంలో సెరెనా విలియమ్స్ హాజరై ర్యాంప్ వాక్ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోడళ్లు వారి దుస్తులకు తగినట్లుపట్టుకున్న రకరకాల హ్యాండ్ బ్యాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రేపటితో ఫ్యాషన్ వీక్ ముగియనుంది.

కాగా, ఫ్యాషన్‌లో సెరెనా విలియమ్స్ తన ప్రియుడు డ్రేక్‌తో ప్రేమ ఒలకబోసింది. సెరెనా అతడ్ని కౌగిలించుకుంటే.. అతడు ముద్దులు పెట్టాడు.
సెరెనా, కెనడాకు చెందిన గాయకుడు డ్రేక్ 2011లో కొంతకాలం డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విడిపోయినా వీరు మళ్లీ ఇటీవలే తమ ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.