న్యూయార్క్: టెన్నిస్‌లో దూసుకెళ్తున్న అమెరికా ప్రపంచ నెంబర్‌వన్ సెరెనా విలియమ్స్ ప్రేమలోనూ జోరుమీదుంది. తాజాగా సిన్సినాటీలోని ఓ రెస్టారెంట్లో ప్రియుడు డ్రేక్‌తో ఆమె సన్నిహితంగా ఉన్న చిత్రాలు టెన్నిస్ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి.

ఆ ముద్దులు, కౌగిలింతలు చూశాక వీళ్లిద్దరు మళ్లీ ఒక్కటయ్యారని అనుకుంటున్నారు అభిమానులు. సెరెనా, కెనడాకు చెందిన గాయకుడు డ్రేక్ 2011లో కొంతకాలం డేటింగ్ చేశారు. విడిపోయినా స్నేహితులుగా కొనసాగారు.
మళ్లీ ఇన్నాళ్ల తర్వాత జంటగా విహారం చేస్తున్నారు. సెరెనా ఆడే ప్రతి గ్రాండ్‌స్లామ్ టోర్నీకి డ్రేక్ హాజరవుతుండటం గమనార్హం.