Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'బార్సిలోనా' నాదల్‌దే: 11వ సారి టైటిల్‌ నెగ్గిన స్పెయిన్‌ బుల్‌

Domineering Nadal eases to 11th Barcelona title

హైదరాబాద్: క్లే కోర్టులో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్. ఆదివారం జరిగిన బార్సిలోనా ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ నాదల్ 6-2, 6-1 తేడాతో స్టెఫానోస్ స్టిసిపాస్(గ్రీస్)పై అలవోక విజయం సాధించాడు.

77 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో రఫెల్ నాదల్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించాడు. వరుస సెట్లలో స్టెఫానోస్‌ను చిత్తుగా ఓడించాడు. క్లేకోర్టులో రికార్డు స్థాయిలో 400వ విజయంతో ఫైనల్లోకి అడుగుపెట్టిన రఫెల్ నాదల్ అదే జోరులో 11వ బార్సిలోనా టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

గతవారం మాంటెకార్లో టైటిల్ గెలిచిన నాదల్‌కు క్లేకోర్టులో ఇది 55వ టైటిల్ కాగా మొత్తంగా 77వది కావడం విశేషం. క్లేకోర్టులో వరుసగా 19వ విజయం నమోదు చేసుకున్న నాదల్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తూ నిర్వాహకులు మ్యాచ్ అనంతరం ఓ ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు.

ఈ వీడియోలో తాను సాధించిన బార్సిలోనా టైటిళ్లను చూపించడంతో రఫెల్ నాదల్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. గతవారం మాంటేకార్లో టైటిల్‌ నెగ్గిన రఫెల్ నాదల్ తాజా విజయంతో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.

Story first published: Monday, April 30, 2018, 9:31 [IST]
Other articles published on Apr 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+