Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకే వేదిక: ఒకవైపు ప్రపంచకప్‌.. మరోవైపు వింబుల్డన్‌

Djokovic, Federer, Nadal Big Three Domination At Wimbledon & Serena Williams

ఒకే వేదికలో జరుగుతున్న రెండు ప్రతిష్టాత్మక టోర్నీలను క్రికెట్, టెన్నిస్ అభిమానులు ఎంజాయ్ చేయనున్నారు. ఒకవైపు ప్రపంచకప్‌.. మరోవైపు వింబుల్డన్‌లతో ఇంగ్లండ్‌లో మరింత జోష్‌ రానుంది. క్రికెట్ ప్రపంచకప్‌ తుది అంకానికి చేరుకోగా.. సోమవారం నుండి ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ టోర్నీ ప్రారంభం కానుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

వింబుల్డన్‌లో స్టార్ ఆటగాళ్లు నొవాక్‌ జొకోవిచ్‌, రోజర్‌ ఫెదరర్‌, రఫెల్‌ నదల్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. ప్రపంచనెంబర్‌ వన్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ తొలి రౌండ్‌లో జర్మనీకి చెందిన ఫిలిప్‌ కోల్‌ష్రీబెర్‌తో పోటీ పడనున్నాడు. మూడోసీడ్‌ నదల్‌ జపాన్‌ ఆటగాడు యూచి సుగిటతో.. రెండోసీడ్‌, స్విస్‌ దిగ్గజం ఫెడరర్‌ మంగళవారం జరిగే మొదటి రౌండ్‌లో లాయిడ్‌ హారిస్‌ (సౌతాఫ్రికా)ను ఢీకొననున్నారు. డొమినిక్‌ థీమ్‌, అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌, స్టెఫనోస్‌ సిస్టిపాస్‌ కూడా బరిలో ఉన్నారు.

పురుషుల సింగిల్స్‌ విభాగం కంటే మహిళల సింగిల్స్‌ విభాగంలో పోటీ ఇంకాస్త ఎక్కువగానే ఉంది. ఈ మధ్య కాలంలో కొత్త క్రీడాకారిణులు దూసుకురావడం.. సీనియర్లు సెరెనా విలియమ్స్‌, మారియా షరపోవాలు ఫామ్‌లో లేకపోవడంతో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. మొత్తం ఏడుగురు గ్రాండ్‌స్లామ్‌ విజేతలు పోటీపడుతున్నారు.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వరుసగా తొలి ఏడు స్థానాల్లో ఉన్న ఆష్లే బార్తీ, నవోమి ఒసాకా, కరోలినా ప్లిస్కోవా, కికి బెర్టెన్స్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఏంజెలిక్‌ కెర్బర్‌, క్విటోవా, సిమోనా హలెప్‌లతో పాటు మాజీ విజేతలు షరపోవా, సెరెనా విలియమ్స్‌ బరిలో ఉన్నారు. ఇక జొనా కొంటా లోకల్‌ స్టార్‌గా రంగంలోకి దిగుతోంది. గత కొంతకాలంగా షరపోవా, సెరెనా ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో యువ క్రీడాకారిణులే టైటిల్ నెగ్గే అవకాశం ఉంది.

Story first published: Monday, July 1, 2019, 9:08 [IST]
Other articles published on Jul 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+