యుఎస్ ఓపెన్: మిల్మన్‌పై అలవక విజయం, సెమీస్‌కు జోకోవిచ్

హైదరాబాద్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్‌లో నోవాక్ జోకోవిచ్ జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన జొకోవిచ్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియన్ అన్‌సీడెడ్ ప్లేయర్ జాన్ మిల్మన్‌తో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ 6-3, 6-4, 6-4తేడాతో విజయం సాధించాడు.
14వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌పై కన్నేసిన జొకొవిచ్ తన కెరీర్‌లో మూడో యుఎస్ ఓపెన్‌ను టైటిల్ నెగ్గాలని పట్టుదలతో ఉన్నాడు. గతేడాది గాయం కారణంగా యుఎస్ ఓపెన్‌కు జోకోవిచ్ దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో 11 సార్లు సెమీఫైనల్‌కు చేరాడు.
కనీస పోటీని ఇవ్వలేకపోయిన మిల్మన్
ప్రీ క్వార్టర్‌ఫైనల్లో స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌ను నాలుగు సెట్లలో ఓడించి సంచలనం సృష్టించిన మిల్మన్ క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ అలవోకగా ఓడించాడు. జొకొవిచ్‌కు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాడు. నిజానికి ఈ మ్యాచ్‌కి ముందు సెర్బియా స్టార్ నొవాక్ జొకొవిచ్‌కు మిల్మన్ గట్టి పోటీ ఇస్తాడని అంతా భావించారు.

ఏకపక్షంగా ముగిసిన మ్యాచ్
అయితే, మిల్మన్ విఫలమవ్వడంతో హోరాహోరీగా సాగుతుందనుకున్న పోటీ కాస్తా ఏకపక్షంగా ముగిసింది. మిల్మన్ ఒక్క సెట్ కూడా నెగ్గకుండానే చేతులెత్తేశాడు. తొలి సెట్ నుంచే నొవాక్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. తనదైన శైలిలోనే ఎదురుదాడికి దిగి ప్రత్యర్దిపై ఆధిపత్యం ప్రదర్శించాడు.
6-3తో తొలి సెట్‌ను నెగ్గిన జొకొవిచ్
తొలి సెట్‌ను 6-3తో సెట్ నెగ్గాడు. ఇక, రెండో సెట్‌ను 6-4తో దక్కించుకున్నాడు. మూడో సెట్‌లోనూ మిల్మన్, జొకొవిచ్ జోరుని అడ్డుకోలేకపోయాడు. దీంతో చివరి సెట్‌ను 6-4తో సొంతం చేసుకుని మ్యాచ్‌ని కూడా కైవసం చేసుకున్నాడు. ఫైనల్ బెర్త్ కోసం సెమీఫైనల్‌లో జపనీస్ స్టార్ కై నిషికోరీతో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
14కు చేరనున్న టైటిళ్ల సంఖ్య
యుఎస్ ఓపెన్‌లో నొవాక్ జొకొవిచ్ దూకుడు చూస్తుంటే టైటిల్ విజేతగా నిలవడం ఖాయమని టెన్నిస్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న యుఎస్ ఓపెన్ టైటిల్‌ను జొకొవిచ్ సొంతం చేసుకుంటే గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సంఖ్య 14కు చేరుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications