Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓటమి: కోపంతో చొక్కా చింపేసి, రాకెట్‌ విరగ్గొట్టిన జొకోవిచ్‌

న్యూఢిల్లీ: ఆటలో గెలుపు ఓటమి సహజం. కానీ టెన్నిస్‌లో వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడిగా కొనసాగుతున్న సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మాత్రం ఓటమిని తట్టుకోలేకపోయాడు. షాంఘై మాస్టర్స్‌ సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో 19వ ర్యాంకు ఆటగాడు రోబర్ట్‌ బటిస్టా అగట్‌ చేతిలో ఓడడాన్ని నొవాక్‌ తట్టుకోలేకపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాగా, శనివారం జరిగిన షాంఘై సెమీపైనల్స్‌లో ప్రపంచ నెంబర్‌ వన్‌ జొకోవిచ్‌ 4-6, 4-6తో వరుస సెట్లలో 15వ సీడ్‌ బటిస్టా అగట్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఆరో ప్రయత్నంలో 12 గ్రాండ్‌ స్లామ్స్‌ టైటిళ్ల విజేత నొవాక్‌ను అగట్‌ ఓడించగలిగాడు. తొలి సెట్‌లో జొకోవిచ్ రెండు బ్రేక్‌ పాయింట్లు రాబట్టుకోవడంలో విఫలమయ్యాడు.

Djokovic explains erratic behavior after Shanghai loss

దీంతో నిగ్రహం కోల్పోయిన నొవాక్‌ కోర్టులోనే చొక్కా చింపేసుకున్నాడు. తన ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు. ముఖ్యంగా కీలక పాయింట్లు కోల్పోయినప్పుడు రాకెట్‌ను విరగ్గొట్టాడు. దీంతో చైర్‌ అంపైర్‌ నొవాక్‌‌ను హెచ్చరించాడు. మూడుసార్లు షాంఘై టోర్నీ చాంపియన్‌ జొకోవిచ్‌కు స్పెయిన్‌ ఆటగాడు అగట్‌ షాకిచ్చాడు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన తర్వాత జొకోవిచ్‌ తన ఫామ్‌ కోల్పోయాడు. దీంతో అతడు తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. వింబుల్డన్‌, రియో ఒలింపిక్స్‌లో కూడా నొవాక్‌ జొకోవిచ్ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+