Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సానియాకు ఇంటి కష్టాలు: మాజీ సిఎం బంధువు తిష్ట

Sania Mirza
హైదరాబాద్: లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించడానికి శ్రమిస్తున్న హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు ఇంటి కష్టాలు వచ్చి పడ్డాయి. సానియా ఇంట్లో ఓ మాజీ ముఖ్యమంత్రి బంధువు తిష్ట వేసి ఖాళీ చేయడానికి మొండికేస్తున్నాడు. ఈ వివాదం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు చేరింది. ఈ మేరకు ఓ ప్రముఖ దినపత్రికలో ఓ వార్తాకథనం ప్రచురితమైంది.

సానియా మీర్జా ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి బంధవు కావడంతో, అది సివిల్ కేసు కావడంతో ఏం చేయాల్లో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ పత్రికా కథనం ప్రకారం - జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 78లోని భరణి లేఅవుట్ సమీపంలో సానియా మీర్జాకు ఓ ఇల్లు ఉంది. కొద్ది కాలంగా ఆ ఇంటిని ఓ వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. మొదట్లో అద్దె విషయంలో బాగానే ఉన్నా ఇటీవల మధ్య విభేదాలు పొడసూపాయి.

దాంతో కొంత కాలంగా అద్దె విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మరోవైపు అద్దె ఇంటి ముందు సానియా మీర్జాతో ఉన్న నేమ్ ప్లేట్ పగిలిపోయింది. దీంతో తమ ఇంటి అద్దె చెల్లించడం లేదని, దాంతో పాటు నేమ్ ప్లేట్‌ను పగులగొట్టారని సానియా తల్లి నసీమా నాలుగు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తిపై సెక్షన్ 427 కింద కేసు నమోదు చేశారు.

అయితే, ఆ వ్యక్తి ఓ మాజీ ముఖ్యమంత్రి బంధువు అని తెలుసకున్న పోలీసులు కంగు తిన్నట్లు సమాచారం. ఇది సివిల్ తగాదా కావడంతో కేవలం ఇంటి ముందున్న నేమ్ ప్లేట్ తొలగించినందుకు కేసు నమోదు చేసి అద్దె వివాదాన్ని కోర్టులో తేల్చుకోవాల్సిందిగా పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అద్దెకున్న వ్యక్తి ఇప్పటికే కోర్టును ఆశ్రయించి తాను నెల తర్వాత ఇల్లు ఖాళీ చేసే విధంగా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నట్లు తెలుస్తోందంటూ ఆ పత్రిక రాసింది.

Story first published: Wednesday, November 15, 2017, 12:24 [IST]
Other articles published on Nov 15, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+