న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. మరో దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పేస్ పేరును ప్రస్తావించకుండానే అతనో విషపురుగు అంటూ విమర్శించింది.
గత రెండు ఒలింపిక్స్ కు డబుల్స్ జోడీల ఎంపికపై భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ చేసిన విమర్శల నేపథ్యంలో ఈ హైదరాబాదీ క్రీడాకారిణి పై విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.

సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమే విజయం సాధించడమని పరోక్షంగా పేస్‌ను ఉద్దేశించి సానియా ట్వీట్ చేసింది. గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో డబుల్స్‌లో అత్యుత్తమ జోడీలను పంపలేకపోయామని పేస్ వ్యాఖ్యానించాడు.
రియో, గత లండన్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున మేటి డబుల్స్ జంటను పంపలేదని, దీనివల్లే తగిన మూల్యం చెల్లించుకున్నామని చెప్పాడు. ఈ ఒలింపిక్స్‌లో మంచి మిక్స్‌డ్ జోడీని బరిలోకి దించే అవకాశాన్ని కాదనుకున్నామని అన్నాడు. సానియ, రోహన్ బోపన్న ను ఎంపిక చేయడాన్ని పేస్ తప్పుపట్టాడు. ఈ క్రమంలోనే పేస్ ఓ విషపురిత వ్యక్తి అంటూ సానియా మండిపడ్డారు.